Telugu Global
Cinema & Entertainment

సాహో.... సైకో సయ్యా....

మొన్నటివరకు షేడ్స్ ఆఫ్ సాహో, టీజర్ తో అలరించిన ఈ సినిమా ఇకపై పాటలతో హంగామా చేయబోతోంది. రేపు ఈ సినిమాకు సంబంధించి ‘సైకో సయ్యా’ అనే పాటను విడుదల చేయబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ సంగీత దర్శకుడి టైటిల్ కార్డు కింద ఎవరి పేరు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా నుంచి శంకర్-ఎహశాన్-లాయ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నుంచి తప్పుకునే సమయానికే వాళ్లు 3 పాటలు కంపోజ్ చేశారు. వాటిలో […]

సాహో.... సైకో సయ్యా....
X

మొన్నటివరకు షేడ్స్ ఆఫ్ సాహో, టీజర్ తో అలరించిన ఈ సినిమా ఇకపై పాటలతో హంగామా చేయబోతోంది. రేపు ఈ సినిమాకు సంబంధించి ‘సైకో సయ్యా’ అనే పాటను విడుదల చేయబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ సంగీత దర్శకుడి టైటిల్ కార్డు కింద ఎవరి పేరు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా నుంచి శంకర్-ఎహశాన్-లాయ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నుంచి తప్పుకునే సమయానికే వాళ్లు 3 పాటలు కంపోజ్ చేశారు. వాటిలో 2 పాటల్ని వాడినట్టు తెలుస్తోంది. ఆ రెండు పాటలకు వాళ్ల పేర్లు వేస్తారు. ఇక ఫస్ట్ సింగిల్ గా రాబోతున్న సైకో సయ్యా పాటను కంపోజ్ చేసింది మాత్రం వీళ్లు కాదు.

బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న తనిష్క్ బాగ్చీ ఈ సాంగ్ కంపోజ్ చేశాడు. అతడి పేరునే టైటిల్ కార్డ్ లో వేయబోతున్నారు. ఇలా మరో ఇద్దరు కొత్త సంగీత దర్శకుల పేర్లు కూడా త్వరలోనే తెరపైకి రాబోతున్నాయి.

మరోవైపు సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను జిబ్రాన్ కు అప్పగించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన టీజర్ కోసం ఓ విదేశీ కంపెనీ నుంచి ట్రాక్ కొన్నారు. దాన్ని కాస్త అటుఇటు మార్చింది ఇతడే. పనిలోపనిగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే బాధ్యతను కూడా ఇతడికే అప్పగించారు.

నిజానికి ఈ సినిమాలోకి తమన్ ను తీసుకుంటారని అంతా భావించారు. షేడ్స్ ఆఫ్ సాహో పేరిట విడుదలైన మేకింగ్ వీడియోస్ కు తమనే నేపథ్య సంగీతం అందించాడు. అతడ్ని అక్కడికే పరిమితం చేశారా లేక తమన్ తో ఓ సాంగ్ కూడా చేయించారా అనేది త్వరలోనే తెలుస్తుంది.

First Published:  7 July 2019 1:13 AM GMT
Next Story