Telugu Global
NEWS

ప్రపంచకప్ లో భారత్ 7వ గెలుపు

శ్రీలంకపై 7 వికెట్లతో విజయం రోహిత్, రాహుల్ సెంచరీల జోరు రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ 15 పాయింట్లు వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో…టాప్ ర్యాంకర్ భారత్ అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సెమీఫైనల్స్ చేరింది. లీడ్స్ వేదికగా ముగిసిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో మాజీ చాంపియన్ శ్రీలంకను 7 వికెట్లతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక..50 […]

ప్రపంచకప్ లో భారత్ 7వ గెలుపు
X
  • శ్రీలంకపై 7 వికెట్లతో విజయం
  • రోహిత్, రాహుల్ సెంచరీల జోరు
  • రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ 15 పాయింట్లు

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో…టాప్ ర్యాంకర్ భారత్ అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సెమీఫైనల్స్ చేరింది. లీడ్స్ వేదికగా ముగిసిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో మాజీ చాంపియన్ శ్రీలంకను 7 వికెట్లతో భారత్ చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక..50 ఓవర్లలో 7 వికెట్లకు 264 పరుగుల స్కోరు సాధించింది. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా శ్రీలంకకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

100 వికెట్ల క్లబ్ లో బుమ్రా..

భారత ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా 100 వికెట్ల క్లబ్ లో చోటు సంపాదించాడు. 10 ఓవర్లలో 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ వరకూ తన కెరియర్ లో 57 వన్డే మ్యాచ్ లు ఆడిన బుమ్రా మొత్తం 102 వికెట్లు పడగొట్టాడు.

రోహిత్ 5వ శతకం…

265 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, రాహుల్ 189 పరుగుల భారీ భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

రోహిత్ 103, రాహుల్ 111 పరుగులు స్కోర్లు సాధించగా…కెప్టెన్ కొహ్లీ 34, పాండ్యా 7 పరుగుల తో నాటౌట్ గా నిలిచారు. భారత్ 43.3 ఓవర్లలోనే 7 వికెట్ల విజయం సొంతం చేసుకొంది.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

శ్రీలంకతో 4-4 రికార్డు….

ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ భారత్- శ్రీలంక జట్లు ఎనిమిదిసార్లు తలపడితే చెరో నాలుగు విజయాలతో సమఉజ్జీగా నిలిచాయి.
అంతేకాదు… వన్డే క్రికెట్లో ఈ రెండుజట్లూ రికార్ఢుస్థాయిలో 139 సార్లు ఢీకొనడం మరో విశేషం.

సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లపై నెగ్గిన భారత్ కు ఇంగ్లండ్ చేతిలో పరాజయం తప్పలేదు.

న్యూజిలాండ్ తో మ్యాచ్ వర్షం దెబ్బతో రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.

First Published:  6 July 2019 10:00 PM GMT
Next Story