Telugu Global
NEWS

ప్రపంచకప్ లీగ్ టేబుల్ టాపర్ భారత్

తొలిసెమీఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ పోరు  రెండో సెమీఫైనల్లో ఆసీస్ తో ఇంగ్లండ్ అమీతుమీ ఆఖరిరౌండ్లో భారత్ గెలుపు, ఆస్ట్రేలియా ఓటమి ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా గత ఐదువారాలుగా జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. హాట్ ఫేవరెట్లు భారత్, ఐదుసార్లు విజేత ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లండ్, గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సెమీస్ కు అర్హత సంపాదించాయి. భారత్ టాప్ గేర్…. మొత్తం 10 జట్లు, 45 […]

ప్రపంచకప్ లీగ్ టేబుల్ టాపర్ భారత్
X
  • తొలిసెమీఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ పోరు
  • రెండో సెమీఫైనల్లో ఆసీస్ తో ఇంగ్లండ్ అమీతుమీ
  • ఆఖరిరౌండ్లో భారత్ గెలుపు, ఆస్ట్రేలియా ఓటమి

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా గత ఐదువారాలుగా జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. హాట్ ఫేవరెట్లు భారత్, ఐదుసార్లు విజేత ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లండ్, గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సెమీస్ కు అర్హత సంపాదించాయి.

భారత్ టాప్ గేర్….

మొత్తం 10 జట్లు, 45 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ సమరంలో భారత్ టాపర్ గా నిలిచింది. తొమ్మిదిరౌండ్ల మ్యాచ్ ల్లో 7 విజయాలు, ఓ ఓటమి, వర్షంతో రద్దయిన ఓ మ్యాచ్ ద్వారా 15 పాయింట్లు సాధించి… అగ్రస్థానంలో నిలిచింది.

లీడ్స్ వేదికగా ముగిసిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో మాజీ చాంపియన్ శ్రీలంకను 7 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టింది.

ఆఖరి రౌండ్లో కంగారూలకు షాక్…

మొదటి 8రౌండ్ల మ్యాచ్ ల్లో టేబుల్ టాపర్ గా కొనసాగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఆఖరి రౌండ్ మ్యాచ్ లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో కంగు తినిపించింది. దీంతో ఆస్ట్రేలియా 7 విజయాలు, 2 పరాజయాలతో 14 పాయింట్లతో రెండోస్థానానికి పడిపోయింది. భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది.

3, 4 స్థానాలలో ఇంగ్లండ్, న్యూజిలాండ్

ఆతిథ్య ఇంగ్లండ్ 9 రౌండ్లలో 6 విజయాలు, 3 పరాజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా మూడో స్థానం సాధించిన జట్టుగా సెమీస్ రేస్ లో నిలిచింది.

2015 టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ 9 రౌండ్లలో 5 విజయాలు, 3 పరాజయాలతో సహా 11 పాయింట్లు సాధించడం ద్వారా నాలుగో స్థానంలో నిలవడం ద్వారా నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది.

తొలిసెమీస్ లో భారత్ తో కివీస్ ఢీ..

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా జులై 9న జరిగే తొలి సెమీఫైనల్లో లీగ్ టేబుల్ టాపర్ భారత్ తో నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టు తలపడనుంది.

లీగ్ దశలో ఈ రెండుజట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వానదెబ్బతో రద్దయిన సంగతి తెలిసిందే. కొహ్లీ నాయకత్వంలోని భారత్ కు కేన్ విలియమ్స్ సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ జట్టు గట్టిపోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

రెండో సెమీస్ లో ఆసీస్ తో ఇంగ్లండ్ పోరు…

లీగ్ టేబుల్ రెండో స్థానంలో నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో మూడో స్థానం సాధించిన ఇంగ్లండ్ తలపడుతుంది. జులై 11న బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా రెండో సెమీస్ సమరం ప్రారంభమవుతుంది.

భారత్- న్యూజిలాండ్ సెమీస్ తో పోల్చుకొంటే…ఇంగ్లండ్- ఆసీస్ సమరమే మరింత ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.

First Published:  6 July 2019 10:20 PM GMT
Next Story