రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

భారత క్రికెటర్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఒకే వరల్డ్ కప్‌లో అత్యథిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పాడు.

ఇప్పటి వరకు ఒకే వరల్డ్ కప్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా సంగక్కర పేరున రికార్డు ఉంది. కానీ ఈ వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు చేయడం ద్వారా రోహిత్ శర్మ సంగక్కర రికార్డును అధిగమించాడు. 92 బంతుల్లోనే రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.

వరుసగా మూడు సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా కూడా రోహిత్ శర్మ ఖ్యాతిగడించాడు. ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. సచిన్‌ 45 వరల్డ్ కప్‌ మ్యాచ్‌ లలో ఆరు సెంచరీలు చేశాడు. కానీ రోహిత్ శర్మ కేవలం 16 మ్యాచ్‌ల్లోనే ఆరు సెంచరీలు చేశాడు.