కోగంటి సత్యం అరెస్ట్‌

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో విజయవాడకు చెందిన కోగంటి సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. కోగంటి సత్యమే రాంప్రసాద్‌ను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.

హత్యకు కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదని… తానే హత్య చేశానంటూ శ్యాం అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. కోగంటి సత్యంను కాపాడేందుకే శ్యాం తెరపైకి వచ్చి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శ్యాంకు డబ్బులు ఇచ్చి ఈ హత్యను కోగంటి సత్యమే చేయించి ఉంటారని భావిస్తున్నారు.

అటు రాంప్రసాద్ కుమారుడు కూడా శ్యాంకు ఈ హత్య చేయాల్సిన అవసరం లేదని… హత్య వెనుక కోగంటి సత్యమే ఉన్నారని ఆరోపిస్తున్నారు.

అటు రాంప్రసాద్ బావమరిది కూడా కోగంటి సత్యం, శ్యాం కలిసి కేసును తనపైకి తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన బావను తానెందుకు హత్య చేయిస్తానని రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ చెబుతున్నారు.