వైఎస్‌ను స్మరించుకున్న మమతా బెనర్జీ

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులర్పించారు. ఆయన జయంతి సందర్భంగా ట్విట్టర్‌లో వైఎస్‌ను ఆమె స్మరించుకున్నారు. ట్వీట్‌ను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ట్యాగ్ చేశారామె.

బెంగాల్ సీఎం మమతా… వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించడాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబుకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారానికి వచ్చారు. మమతా బెనర్జీతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు కూడా వైఎస్‌కు నివాళులర్పించారు.