Telugu Global
Cinema & Entertainment

సినిమాలు తక్కువ.... ఫాలోయర్స్ ఎక్కువ....

అక్కినేని హీరో నాగ చైతన్య సరసన ‘సవ్యసాచి’ సినిమాలో నటించిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో రొమాన్స్ చేసిన నిధి అగర్వాల్ మొదటి రెండు సినిమాలతో మంచి విజయాన్ని సాధించలేకపోయింది. మరోవైపు బాలీవుడ్ లో నటించిన ‘మున్నా మైకేల్’ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈమె ప్రస్తుతం రామ్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో […]

సినిమాలు తక్కువ.... ఫాలోయర్స్ ఎక్కువ....
X

అక్కినేని హీరో నాగ చైతన్య సరసన ‘సవ్యసాచి’ సినిమాలో నటించిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో రొమాన్స్ చేసిన నిధి అగర్వాల్ మొదటి రెండు సినిమాలతో మంచి విజయాన్ని సాధించలేకపోయింది.

మరోవైపు బాలీవుడ్ లో నటించిన ‘మున్నా మైకేల్’ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈమె ప్రస్తుతం రామ్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది.

చేసింది మూడు నాలుగు సినిమాలే అయినప్పటికీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ ఫాలోయర్స్ సంఖ్య త్రీ మిలియన్ కు చేరింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఆమెకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే తన హాట్ పిక్చర్స్ అని చెప్పవచ్చు.

మరి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో అయినా విజయాన్ని అందుకొని పెద్ద అవకాశాలను నిధి అగర్వాల్ చేజిక్కించుకుంటుందో లేదో చూడాలి.

First Published:  8 July 2019 5:15 AM GMT
Next Story