Telugu Global
Cinema & Entertainment

సైకో సయ్యా: తెలుగు పాట లాగా అనిపించడం లేదు !

సాహో సినిమా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఆసక్తి రేపుతున్న చిత్రం. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడం తో ఎక్కడ లేని అంచనాలు ఈ సినిమా మీద వచ్చి పడ్డాయి. పైగా పాన్ ఇండియా లెవెల్ కి ప్రభాస్ ఎదగడం తో ప్రభాస్ మార్కెట్ పెరిగింది. హిందీ లో కూడా ప్రభాస్ ని అభిమానించే వారు పెరగడం తో ఈ సినిమా ని హిందీ లో భారీ ఎత్తున విడుదల […]

సైకో సయ్యా: తెలుగు పాట లాగా అనిపించడం లేదు !
X

సాహో సినిమా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఆసక్తి రేపుతున్న చిత్రం. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడం తో ఎక్కడ లేని అంచనాలు ఈ సినిమా మీద వచ్చి పడ్డాయి.

పైగా పాన్ ఇండియా లెవెల్ కి ప్రభాస్ ఎదగడం తో ప్రభాస్ మార్కెట్ పెరిగింది. హిందీ లో కూడా ప్రభాస్ ని అభిమానించే వారు పెరగడం తో ఈ సినిమా ని హిందీ లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

అయితే ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. అందులో భాగం గా బాలీవుడ్ స్టైల్ లో నే ఈ సినిమా నుంచి సైకో సయ్యా అనే పాట వీడియో ని విడుదల చేసారు సినిమా యూనిట్. అయితే ఈ పాట హిందీ వీడియో మొదట విడుదల చేశారు. తనిష్క్ బక్చి ఈ పాటకు సంగీతం అందించాడు.

హిందీ లో ఈ పాట వినసొంపు గా కూడా ఉంది… కానీ తెలుగు కి వచ్చేసరికి మాత్రం డబ్బింగ్ పాట లాగా అనిపించింది. అనిరుద్ పాడినప్పటికీ ఈ పాటకి సరైన కిక్ రాలేదు అనే చెప్పాలి. కానీ పాట విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

First Published:  8 July 2019 1:36 AM GMT
Next Story