Telugu Global
Cinema & Entertainment

పూరితో వర్క్ చేస్తే ఆ కిక్కే వేరప్పా

సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. హీరోల్ని మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తి పరుస్తాడు పూరి జగన్నాధ్. చివరికి బాలకృష్ణ లాంటి వ్యక్తి కూడా పూరితో మళ్లీ మళ్లీ సినిమా చేయాలని ఉందన్నాడంటే.. ఈ దర్శకుడు తెరవెనక హీరోలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటాడో అర్థమౌతూనే ఉంది. ఇక మహేష్ బాబు సంగతైతే చెప్పనక్కర్లేదు. పూరి ఎప్పుడంటే అప్పుడు కథ వినడానికి టైమ్ కేటాయిస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడీ లిస్ట్ లోకి రామ్ కూడా చేరిపోయాడు. పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ […]

పూరితో వర్క్ చేస్తే ఆ కిక్కే వేరప్పా
X

సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. హీరోల్ని మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తి పరుస్తాడు పూరి జగన్నాధ్. చివరికి బాలకృష్ణ లాంటి వ్యక్తి కూడా పూరితో మళ్లీ మళ్లీ సినిమా చేయాలని ఉందన్నాడంటే.. ఈ దర్శకుడు తెరవెనక హీరోలతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటాడో అర్థమౌతూనే ఉంది. ఇక మహేష్ బాబు సంగతైతే చెప్పనక్కర్లేదు. పూరి ఎప్పుడంటే అప్పుడు కథ వినడానికి టైమ్ కేటాయిస్తుంటాడు ఈ హీరో. ఇప్పుడీ లిస్ట్ లోకి రామ్ కూడా చేరిపోయాడు.

పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు రామ్. ఆ సినిమాకు సంబంధించి తాజాగా వరంగల్ లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో మాట్లాడిన రామ్.. పూరితో వర్క్ చేస్తుంటే అసలు టైమ్ తెలియడం లేదని ప్రకటించాడు. పూరి జగన్నాధ్ తో వర్క్ చేస్తే ఆ కిక్కే వేరని, హీరోల్ని కంఫర్ట్ గా ఉంచడంలో పూరి తర్వాతే ఎవరైనా అంటూ ఆకాశానికెత్తేశాడు.

“ఏ సినిమా చేయాలో ఆలోచించుకుంటూ నేను విదేశాల‌కు వెళ్లిపోయాను. డ్యాన్సులు, ఫైట్స్‌, లుక్స్ స‌హా అన్ని ఉండి కొత్త‌గా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటున్నార‌ని తెలిసింది. ఆ స‌మ‌యంలో పూరిగారిని క‌లిసిన‌ప్పుడు 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఐడియా వ‌చ్చింది. బేసిక్ పాయింటే కొత్త‌గా ఉంటుంది. ఫ‌స్ట్ టైమ్ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో వ‌స్తున్నాం.
చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను.”

బోనాలు పండుగ‌కి వ‌రంగ‌ల్ రావ‌డం, సెల‌బ్రేట్ చేసుకోవ‌డం… అదే స‌మ‌యంలో సినిమాలో కూడా బోనాలు పాట ఉండ‌టం చాలా ఆనందంగా ఉందన్నాడు రామ్. మొత్తమ్మీద రామ్ ను కూడా పూరి జగన్నాధ్ కవర్ చేసేశాడు. ఇక ఇతడి లిస్ట్ లో యంగ్ హీరోలు మాత్రమే మిగిలారు.

First Published:  8 July 2019 6:44 AM GMT
Next Story