Telugu Global
NEWS

ప్రపంచకప్ లో రోహిత్ సూపర్ హిట్...

వన్డే క్రికెట్లో ..టీమిండియా సూపర్ ఓపెనర్ కమ్ హిట్ మాన్ రోహిత్ శర్మ….ప్రపంచకప్ లో సైతం తన సత్తా చాటుకొన్నాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న 2019 టోర్నీలో ఐదు సెంచరీలతో తన జట్టు సెమీస్ చేరడంలో ప్రధానపాత్ర వహించాడు. మాస్టర్ సచిన్, సంగక్కరల పేరుతో ఉన్న నాలుగు శతకాల ప్రపంచకప్ రికార్డును అధిగమించాడు. ప్రపంచ క్రికెట్లో డాషింగ్ ఓపెనర్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ లాంటి…వీరబాదుడు ఫార్మాట్లలో…. మొనగాడు […]

ప్రపంచకప్ లో రోహిత్ సూపర్ హిట్...
X

వన్డే క్రికెట్లో ..టీమిండియా సూపర్ ఓపెనర్ కమ్ హిట్ మాన్ రోహిత్ శర్మ….ప్రపంచకప్ లో సైతం తన సత్తా చాటుకొన్నాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న 2019 టోర్నీలో ఐదు సెంచరీలతో తన జట్టు సెమీస్ చేరడంలో ప్రధానపాత్ర వహించాడు. మాస్టర్ సచిన్, సంగక్కరల పేరుతో ఉన్న నాలుగు శతకాల ప్రపంచకప్ రికార్డును అధిగమించాడు.

ప్రపంచ క్రికెట్లో డాషింగ్ ఓపెనర్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ లాంటి…వీరబాదుడు ఫార్మాట్లలో…. మొనగాడు రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ లో విశ్వరూపం ప్రదర్శించాడు.

లీడ్స్ వేదికగా శ్రీలంకతో ముగిసిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో రోహిత్ శర్మ సెంచరీ సాధించడం ద్వారా..వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డును తన పేరుతో లిఖించుకొన్నాడు.

సహ ఓపెనర్ రాహుల్ తో కలసి 189 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయటమే కాదు…శతకం సైతం పూర్తి చేశాడు. 94 బాల్స్ లో 14 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 103 పరుగులతో ఐదవ సెంచరీ సాధించాడు. వన్డే కెరియర్ లో తన సెంచరీల సంఖ్యను 27కు పెంచుకొన్నాడు.

8 మ్యాచ్ లు….5 శతకాలు

ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ ఆడిన 8 మ్యాచ్ ల్లో రోహిత్ శర్మ ఐదు శతకాలు సాధించడం ఓ ప్రపంచకప్ రికార్డుగా నిలిచిపోతుంది.

సౌతాఫ్రికాతో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ లో రోహిత్ 122 పరుగులతో సెంచరీ బోణీ కొట్టాడు.

పాక్ పై రోహిత్ మెరుపు సెంచరీ..

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ముగిసిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో రోహిత్ మూడంకెల స్కోరు సాధించాడు.

యువఆటగాడు రాహుల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ మొదటి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.

మొత్తం 113 బాల్స్ లో 3 సిక్సర్లు, 14 బౌండ్రీలతో 140 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. 84 బాల్స్ లోనే వంద పరుగులు సాధించిన రోహిత్… కేవలం 34 బాల్స్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించడం కూడా రికార్డుగా నిలిచింది.

ఇంగ్లండ్ పై 102 పరుగులు

ఇంగ్లండ్ తో ముగిసిన మ్యాచ్ లో 338 పరుగుల భారీటార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు…కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలసి రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన రోహిత్..మొత్తం 109 బాల్స్ లో 15 బౌండ్రీలతో 102 పరుగులు సాధించి అవుటయ్యాడు.

బర్మింగ్ హామ్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన 7వ రౌండ్ పోటీలో సైతం రోహిత్ సెంచరీ బాదాడు.

సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో రోహిత్ శతకాలు సాధించాడు.

214 వన్డేల్లో 27 సెంచరీలు…

పాకిస్థాన్ ప్రత్యర్థిగా ప్రపంచకప్ లో శతకం బాదిన రెండో భారత క్రికెటర్ ఘనతను రోహిత్ శర్మ సొంతం చేసుకొన్నాడు. 2015 ప్రపంచకప్ లో.. పాక్ పై విరాట్ కొహ్లీ సెంచరీ సాధించడం ద్వారా …భారత తొలి క్రికెటర్ గా నిలిచాడు.

శ్రీలంక తో ముగిసిన 9వ రౌండ్ మ్యాచ్ వరకూ…తన కెరియర్ లో 214 వన్డేలు ఆడిన రోహిత్ శర్మకు…27 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలతో సహా..8వేల 600కు పైగా పరుగులు సాధించిన రికార్డు ఉంది.

2007 నుంచి 2019 వరకూ…

2007 సీజన్లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ…ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

గత పుష్కరకాలంలో రోహిత్ ఆడిన మొత్తం 214 వన్డేల్లో 47.3 సగటు నమోదు చేసిన రోహిత్ …వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు.

డబుల్ సెంచరీల హీరో…

వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించడం రోహిత్ కు ఏమాత్రం కొత్తకాదు. 2013 సిరీస్ లో ఆస్ట్రేలియాపై తొలిసారిగా ద్విశతకం సాధించిన రోహిత్ శర్మ..ఆ తర్వాతి రెండు డబుల్ సెంచరీలు…శ్రీలంకపైనే నమోదు చేయడం విశేషం.

2014 సిరీస్ లో….264 పరుగుల ప్రపంచ రికార్డు డబుల్ సెంచరీ సాధించిన రోహిత్…ఆ తర్వాత మూడేళ్ల విరామం తర్వాత…మొహాలీలో మరో ద్విశతకం నమోదు చేయగలిగాడు.

ఇక..ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లలో సైతం రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగిపోవాలని కోరుకొందాం.

First Published:  7 July 2019 11:50 PM GMT
Next Story