దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం…. ప్రియురాలిపై హత్యాయత్నం చేసిన ప్రియుడు

హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి గొంతు కోసి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేష్, బడంగ్‌పేటకు చెందిన మనస్విని ఇవాళ ఉదయం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ లాడ్జీలో దిగారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. మధ్యాహ్నం సమయంలో ప్రియురాలి గొంతును కోసిన వెంకటేష్ ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు.

వీరిరువురినీ గుర్తించిన లాడ్జి సిబ్బంది…. ఆ ప్రేమజంటను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక యువకుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.