జూనియర్ ఎన్టీఆర్…. శ్రీహరి ని ఇలా పిలిచేవారట !

బాడీ బిల్డర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీహరి దాసరి నారాయణరావు ద్వారా నటుడిగా మారారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రలో కూడా మెప్పించాడు శ్రీహరి.

రియల్ స్టార్ గా అందరి మన్ననలు పొందిన శ్రీహరి లివర్ సమస్యతో కన్నుమూశారు. అప్పట్లో ప్రముఖ నటి డిస్కోశాంతిని పెళ్లి చేసుకున్న శ్రీహరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో మొదటి అబ్బాయి మేఘంష్ ఇప్పుడు ‘రాజ్ దూత్’ అనే సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాతో మేఘంష్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన శ్రీహరి భార్య డిస్కో శాంతి జూనియర్ ఎన్టీఆర్ తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ కి శ్రీహరి అంటే చాలా ఇష్టమని…. ప్రేమతో తారక్ శ్రీహరిని బాబాయ్ అని పిలిచే వాడిని అన్నారు డిస్కో శాంతి. అంతేకాకుండా పెళ్ళైన 3 రోజులకే జూనియర్ ఎన్టీఆర్ తమవద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారని… తనకు శ్రీహరి అంటే అంత అభిమానం అని ఎన్టీఆర్ అన్నాడని డిస్కో శాంతి చెప్పారు.