ఇస్మార్ట్ శంకర్ లో వారణాసి ఎపిసోడ్

టెంపర్ సినిమా మొత్తం పూరి స్టయిల్ లోనే ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించరు. సినిమాను మలుపుతిప్పిన సన్నివేశం అదే. సూపర్ హిట్ అవ్వడానికి కారణం కూడా అదే. సరిగ్గా అలాంటి సస్పెన్స్ ఎలిమెంట్ ఇస్మార్ట్ శంకర్ లో కూడా ఉందంటున్నారు మేకర్స్. అదే వారణాసి ఎపిసోడ్.

సినిమాలో హీరో రామ్ ది పాతబస్తీ. పక్కా హైదరాబాదీ. మేనరిజమ్స్, డైలాగ్స్ అన్నీ అలానే చూపించారు. కానీ హీరోకు కాశీతో కనెక్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన సన్నివేశాలు కొన్ని ట్రయిలర్ లో కూడా ఉన్నాయి. అయితే పూర్తిస్థాయిలో చూపించలేదు. సినిమాను మలుపుతిప్పేది ఆ ఎపిసోడే అంటున్నారు.

నిజానికి ఈ సినిమాలో సత్యదేవ్ ది కీలకపాత్ర. విలన్లు అతడ్ని చంపేస్తారు. అతడికి సంబంధించిన మెమొరీని రామ్ బుర్రలో ఫిక్స్ చేస్తారు. అక్కడ్నుంచి సత్యదేవ్ మిషన్ ను రామ్ పూర్తిచేస్తాడన్నమాట. ఇది ఇస్మార్ట్ శంకర్ కథ.