వెబ్ సిరీస్ ల బాట పట్టిన… విష్ణు

గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మంచు విష్ణు మంచి విజయాన్ని మాత్రం ఇప్పటిదాకా సాధించలేకపోయాడు.

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు విష్ణు ఇప్పుడు ఏకంగా నాలుగు ప్రాజెక్టులను మొదలు పెట్టబోతున్నాడు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ నాలుగు ప్రాజెక్టులలో మూడూ వెబ్ సిరీస్ లె. వీటిని మంచు విష్ణు స్వయంగా నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటుడు శ్రీకాంత్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. కొత్త దర్శకుడు రాజ్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నాడట.

అయితే ఈ ప్రాజెక్టుల గురించి అధికారిక ప్రకటన మాత్రం త్వరలో వెలువడనుంది. ఈ ప్రాజెక్టులన్నీ కేవలం తెలుగులోనే కాక…. మరి కొన్ని భాషల్లో కూడా వెలువడనున్నాయి.

అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లకు కొందరు హాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్లు పనిచేయనున్నారు. మరి ఈ ప్రాజెక్టులతో మంచు విష్ణు ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి…!