నా భర్త ‘చై’ నా ప్రపంచం…. టాటూ కనిపించేలా ఫొటో షేర్ చేసిన సమంత

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత గత కొంతకాలంగా కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతోంది.

ఈ మధ్యనే ‘ఓ బేబీ’ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకుంది సమంత. తన నటన అద్భుతం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తుంటే…. మరోవైపు సమంత తాజాగా సోషల్ మీడియా ద్వారా తను ఇప్పటిదాకా అభిమానుల వద్ద దాచిన ఒక విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది. స్వయంగా సామ్ సోషల్ మీడియా ద్వారా విషయం తెలియజేసింది.

ఈమధ్యనే హాట్ ఫోటో షూట్ లో పాల్గొన్న సమంత…. తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ “చాలా అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇప్పటిదాకా మీ అందరి దగ్గర దాచి ఉంచిన టాటూ ఇప్పుడు చూపిస్తున్నాను. నా భర్త ‘చై’ నా ప్రపంచం” అంటూ తన టాటూ కనిపించే లాగా ఫోటోను పోస్ట్ చేసింది సమంత. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి అలా ఇప్పటిదాకా సమంతా దాచి ఉంచిన తన టాటూ ని వెలుగులోకి తీసుకువచ్చింది. మరోవైపు సమంత వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.