Telugu Global
CRIME

కోడెలపై అట్రాసిటీ కేసు నమోదు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యుల పాపాల పుట్టలు పగులుతూనే ఉన్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. తాజాగా కోడెల శివరాంపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నరసరావుపేట పట్టణానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ నేత కాల్వ రవి బంధువు ఎం.నాగరాజు… కోడెల శివరాంపై ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ శివరాం ఏడు లక్షలు తీసుకున్నాడని … కానీ ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో వివరించాడు. నిలదీసినందుకు తనను దూషించాడని […]

కోడెలపై అట్రాసిటీ కేసు నమోదు
X

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యుల పాపాల పుట్టలు పగులుతూనే ఉన్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతున్నారు. తాజాగా కోడెల శివరాంపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

నరసరావుపేట పట్టణానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ నేత కాల్వ రవి బంధువు ఎం.నాగరాజు… కోడెల శివరాంపై ఫిర్యాదు చేశాడు.

ఉద్యోగం ఇప్పిస్తానంటూ శివరాం ఏడు లక్షలు తీసుకున్నాడని … కానీ ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో వివరించాడు. నిలదీసినందుకు తనను దూషించాడని ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు శివరామ్, అతని పీఏ నాగప్రసాద్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్‌ సీఐ వెల్లడించారు.

First Published:  8 July 2019 11:30 PM GMT
Next Story