వాళ్ళు ట్రై చేస్తున్నారు….. సందీప్ ఆల్రెడీ చేసేశాడు….

డిజిటల్ ప్లాట్ ఫామ్ పెరిగిన దగ్గర నుంచి కొత్త రకం కంటెంట్ ని వీక్షించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే తెలుగు లో ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ ఒరిజినల్ కంటెంట్ కల్చర్ ప్రాచుర్యం పొందుతూ ఉంది.

నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు సొంతంగా సినిమాలను నిర్మించి….  ‘ఒరిజినల్ సినిమా’ అనే టాగ్ తో వాళ్ళ సైట్ ల లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హిందీ లో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి…. కానీ తెలుగు లో అయితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు.

అయితే ఇప్పుడు ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా సందీప్ కిషన్ మాట్లాడుతూ తను అమెజాన్ ప్రైమ్ కోసం ఒక సినిమా చేశానని చెప్పాడు. నిజానికి చాలా మంది తెలుగు హీరోలు ట్రై చేస్తున్న నేపథ్యం లో… సందీప్ ఆల్రెడీ సినిమా చేసేయడం విశేషం. ఇది థియేటర్లలో విడుదల కాదు…. త్వరలో ప్రైమ్ లో నే విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా ని బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్-డీకే తెరకెక్కించారు. ‘ది ఫ్యామిలీ మాన్’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారట.