Telugu Global
National

దేశంలో ఇక ప్రైవేటు రైళ్లు..!

మనం ఇప్పటి వరకు ప్రైవేటు బస్సులు, ఫ్లయిట్స్‌ చూసుంటాం. కాని ప్రైవేటు రైళ్లు అసలు చూడలేదు. రవాణా రంగంలో ఇంత వరకు ప్రైవేటు చేతిలోనికి వెళ్లనిది రైల్వే రంగం మాత్రమే. కాని ఎన్డీయే ప్రభుత్వం రైల్వేలో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా లక్నో- ఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2016 బడ్జెట్‌లోనే ఈ తేజస్ రైలు ప్రకటించినా.. ఇప్పుడు దీనికి టైం టేబుల్‌లో చోటు […]

దేశంలో ఇక ప్రైవేటు రైళ్లు..!
X

మనం ఇప్పటి వరకు ప్రైవేటు బస్సులు, ఫ్లయిట్స్‌ చూసుంటాం. కాని ప్రైవేటు రైళ్లు అసలు చూడలేదు. రవాణా రంగంలో ఇంత వరకు ప్రైవేటు చేతిలోనికి వెళ్లనిది రైల్వే రంగం మాత్రమే. కాని ఎన్డీయే ప్రభుత్వం రైల్వేలో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది.

ప్రయోగాత్మకంగా లక్నో- ఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2016 బడ్జెట్‌లోనే ఈ తేజస్ రైలు ప్రకటించినా.. ఇప్పుడు దీనికి టైం టేబుల్‌లో చోటు కల్పించారు. కాగా, దీనిని రైల్వే శాఖ కాకుండా ప్రైవేటు ఆపరేటర్లు నడపనున్నారు. ఇందుకోసం త్వరలోనే టెండర్ల నోటిఫికేషన్ జారీ కానుంది.

లక్నో-ఢిల్లీ తేజస్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6.50కి ప్రారంభమై మధ్యాహ్నం 1.35కి ఢిల్లీ చేరుతుంది. అలాగే ఢిల్లీలో 3.35కి ప్రారంభమై రాత్రి 10.05కి లక్నో చేరుతుంది. విమానంలో మాదిరిగా అత్యాధునికి కోచ్‌లు దీనిలో ఉంటాయి. ప్రతీ సీట్‌కు ఎల్సీడీ స్క్రీన్లు, అత్యాధునికి ప్యాంట్రీ దీని సొంతం.

ప్రస్తుతం దీనికి సంబంధించిన అన్ని కోచ్‌లు సిద్దమై ఢిల్లీలోని ఆనంద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో పార్క్ చేసి ఉంచారు. రాబోయే 100 రోజుల్లో టెండర్లు పిలిచి ప్రైవేటు ఆపరేటర్లకు దీనిని అప్పగించనున్నారు.

అయితే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రైల్వేను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. రాబోయేరోజుల్లో దేశవ్యాస్తంగా తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలు.

First Published:  9 July 2019 6:26 AM GMT
Next Story