Telugu Global
NEWS

ప్రపంచకప్ లో భారత తురుపుముక్కలు

బ్యాటింగ్ లో ఆ ముగ్గురు…బౌలింగ్ లో ఈ ముగ్గురు రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ లేపిన విరాట్ సేన రోహిత్ 5 సెంచరీలతో 647 పరుగులు వన్డే ప్రపంచకప్ పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ స్థాయికి తగ్గట్టుగా ఆడి 15 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఎనిమిదిరౌండ్ల మ్యాచ్ ల్లో ఏడు విజయాలతో నంబర్ వన్ జట్టుగా సెమీస్ లో అడుగుపెట్టింది. బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాలలో అత్యంత […]

ప్రపంచకప్ లో భారత తురుపుముక్కలు
X
  • బ్యాటింగ్ లో ఆ ముగ్గురు…బౌలింగ్ లో ఈ ముగ్గురు
  • రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ లేపిన విరాట్ సేన
  • రోహిత్ 5 సెంచరీలతో 647 పరుగులు

వన్డే ప్రపంచకప్ పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ స్థాయికి తగ్గట్టుగా ఆడి 15 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

ఎనిమిదిరౌండ్ల మ్యాచ్ ల్లో ఏడు విజయాలతో నంబర్ వన్ జట్టుగా సెమీస్ లో అడుగుపెట్టింది.

బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాలలో అత్యంత పటిష్టంగా ఉన్న భారత టాప్ స్టార్లు… రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో చెలరేగిపోయారు. బ్యాటింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్, కెప్టెన్ విరాట్ కొహ్లీ, బౌలింగ్ లో జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, యజువేంద్ర చహాల్ టాప్ స్టార్లుగా నిలిచారు.

సెమీస్ సమరంలో సైతం అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు.

రోహిత్ శర్మ విశ్వరూపం….

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ… రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఆడిన ఎనిమిదిరౌండ్ల మ్యాచ్ ల్లో చెలరేగిపోయాడు. మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్ లో 647 పరుగులతో 92.4 సగటు నమోదు చేశాడు.

సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో ఆడిన మ్యాచ్ ల్లో సెంచరీలు సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలోనే .. ఐదు శతకాలు సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ లో 442 పరుగులతో 63.1 సగటు సాధించాడు.

యువఓపెనర్ రాహుల్ ఒక సెంచరీతో సహా 360 పరుగులతో 51.4 సగటు నమోదు చేశాడు.

మాస్టర్ రికార్డులకు రోహిత్ గురి….

మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న మరో రెండు ప్రపంచకప్ రికార్డులు అధిగమించడానికి రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. ఇప్పటికే …. ప్రపంచకప్ లో సచిన్ సాధించిన ఆరు సెంచరీల రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.

సచిన్ మొత్తం ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో ఆరు శతకాలు బాదితే…రోహిత్ శర్మ మాత్రం 2015, 2019 ప్రపంచకప్ టోర్నీలలోనే ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

అంతేకాదు…సింగిల్ ప్రపంచకప్ లో సచిన్ అత్యధికంగా సాధించిన 673 పరుగుల రికార్డును సైతం రోహిత్ ప్రస్తుత ప్రపంచకప్ లోనే అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లోనే రోహిత్ 647 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ తో జరిగే సెమీస్ లో రోహిత్ మరో 27 పరుగులు సాధించగలిగితే…సచిన్ రికార్డును అధిగమించినట్లవుతుంది.

బుమ్రా బ్యాంగ్ బ్యాంగ్….

భారత స్టార్ బౌలర్, ప్రపంచ టాప్ ర్యాంకర్ జస్ ప్రీత్ బుమ్రా…ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో సత్తా చాటాడు. ఆడిన ఎనిమిదిరౌండ్ల మ్యాచ్ ల్లో..4.5 ఎకానమీతో మొత్తం 17 వికెట్లు సాధించాడు.

మహ్మద్ షమీ టోర్నీ తొలి హ్యాట్రిక్ తో సహా మొత్తం 14 వికెట్లతో 5.5 ఎకానమీ నమోదు చేశాడు. అంతేకాదు…లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ 11 వికెట్లతో 5.9 ఎకానమీతో నిలిచాడు.

రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో అత్యుత్తమంగా రాణించిన ఈ ముగ్గురూ…ఆ ముగ్గురూ…నాకౌట్ సెమీఫైనల్ రౌండ్లో ఏ రేంజ్ లో రాణిస్తారన్న దానిపైనే భారత ప్రపంచకప్ విజయాలు ఆధారపడి ఉన్నాయి.

First Published:  9 July 2019 12:00 AM GMT
Next Story