Telugu Global
NEWS

ప్రపంచకప్ నాకౌట్ ఫైట్ కు భారత్-న్యూజిలాండ్ రెడీ

మాంచెస్టర్ వేదికగా నేడే సెమీస్ తొలిపోరు హాట్ ఫేవరెట్ గా బరిలో విరాట్ సేన హైస్కోరింగ్ మ్యాచ్ తో పరుగుల విందు ప్రపంచ క్రికెట్ అభిమానులను గత ఐదువారాలుగా అలరించిన 2019 ప్రపంచకప్ లో 45 మ్యాచ్ ల లీగ్ దశ ముగియటంతో… సెమీఫైనల్స్ నాకౌట్ ఫైట్లకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. పరుగుల గని మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్న తొలిసెమీఫైనల్లో 2వ ర్యాంకర్ భారత్ తో మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది. […]

ప్రపంచకప్ నాకౌట్ ఫైట్ కు భారత్-న్యూజిలాండ్ రెడీ
X
  • మాంచెస్టర్ వేదికగా నేడే సెమీస్ తొలిపోరు
  • హాట్ ఫేవరెట్ గా బరిలో విరాట్ సేన
  • హైస్కోరింగ్ మ్యాచ్ తో పరుగుల విందు

ప్రపంచ క్రికెట్ అభిమానులను గత ఐదువారాలుగా అలరించిన 2019 ప్రపంచకప్ లో 45 మ్యాచ్ ల లీగ్ దశ ముగియటంతో… సెమీఫైనల్స్ నాకౌట్ ఫైట్లకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

పరుగుల గని మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్న తొలిసెమీఫైనల్లో 2వ ర్యాంకర్ భారత్ తో మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు 7వసారి ప్రపంచకప్ సెమీస్ లో తలపడుతుంటే…కేన్ విలియమ్స్ సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ మాత్రం 8వసారి సెమీస్ బరిలోకి దిగుతోంది.

భారత్ బ్యాటింగ్ కు కివీస్ పేస్ సవాల్…

రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కొహ్లీ, రిషభ్ పంత్, ధోనీ, హార్థిక్ పాండ్యా,రవీంద్ర జడేజా లాంటి హేమాహేమీలతో కూడిన పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ కు…ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ , గ్రాండ్ హోమీలతో కూడిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ గట్టి సవాలు విసురుతోంది.

సూపర్ ఫామ్ లో భారత టాపార్డర్…

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ 5 సెంచరీలతో సహా 647, కెప్టెన్ విరాట్ కొహ్లీ ఐదు హాఫ్ సెంచరీలతో సహా 442, యువఓపెనర్ రాహుల్ ఓ సెంచరీతో సహా 360 పరుగులు సాధించడం ద్వారా కళ్లు చెదిరే ఫామ్ లో నిలిచారు.

మరోవైపు కివీ ఫాస్ట్ బౌలర్లు బౌల్ట్ 15 వికెట్లు, ఫెర్గూసన్ 17 వికెట్లు, నీషమ్ 11, గ్రాండ్ హోమీ 5 వికెట్లతో కలసి మొత్తం 58 వికెట్లు సాధించడం ద్వారా.. భారత్ కు సవాలు విసురుతున్నారు.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ సైతం లీగ్ దశలో ఓ సెంచరీతో సహా 481 పరుగులు సాధించడం ద్వారా తన ఫామ్ ను చాటుకొన్నాడు.

భారత లక్కీ గ్రౌండ్ ఓల్డ్ ట్రాఫర్డ్…

సెమీస్ కు వేదికగా ఉన్న ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో భారత్ కు తిరుగులేని రికార్డే ఉంది. 1983 ప్రపంచకప్ సెమీస్ లో ఇదే గ్రౌండ్లో ఇంగ్లండ్ పై సంచలన విజయం సాధించిన ఘనత భారత్ కు ఉంది. అంతేకాదు.. ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ లో భాగంగా ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ భారత్ తిరుగులేని విజయాలు నమోదు చేసింది.

ఓల్డ్ ట్రాఫర్డ్ వికెట్ బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉండడంతో…భారత స్ట్రోక్ మేకర్లు రోహిత్ , రాహుల్, కొహ్లీ, పాండ్యా పరుగుల మోత మోగించే అవకాశాలున్నాయి.

టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని..350కి పైగా స్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థికి సవాలు విసిరే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య ఇదే గ్రౌండ్లో ముగిసిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో రెండుజట్లూ 300కు పైగా స్కోర్లు సాధించడంతో.. సెమీస్ లోనూ పరుగుల పండుగేననడంలో ఏ మాత్రం సందేహంలేదు.

చిరుజల్లుల వార్నింగ్…

భారత్-న్యూజిలాండ్ జట్ల సెమీస్ రోజున వర్షంతో అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం పడే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది.

దానికితోడు గంటగంటకు మారిపోయే మాంచెస్టర్ వాతావరణం సైతం…మ్యాచ్ తుదిఫలితం పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

ఏదిఏమైనా భారతజట్టే సెమీస్ లో అసలు సిసలు ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

First Published:  8 July 2019 9:39 PM GMT
Next Story