‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమా సీక్వెల్ కోసం నాని…

యువ హీరో నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే సినిమాతో ఈ మధ్యనే హీరోగా పరిచయమయ్యాడు. స్వరూప్ ఆర్ ఎస్ జె అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్ లు నమోదు చేసుకుంటోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శకుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీక్వెల్ సినిమా నాని స్వయంగా నిర్మిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

నిజానికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా విడుదలకు ముందే నాని సినిమా చూసి దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె ని మెచ్చుకోవడం మాత్రమే కాక తప్పకుండా తనతో ఏదో ఒక సినిమా తీస్తానని మాట ఇచ్చాడట.

ఈ నేపథ్యంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్ కి నాని ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ కూడా ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడట. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు నాని చేతుల్లో ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’ వంటి సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.