Telugu Global
NEWS

అసలీ బొల్లినేని గాంధీ ఎవరు?

వంద గొడ్లను తిన్న రాబంధు ఒక్క గాలి వానకు కూలుతుందంటారు. ఇప్పుడు మాజీ ఈడీ అధికారి బొల్లినేని గాంధీ విషయంలోనూ అదే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబుతో పాటు… కేంద్రంలో పెద్ద పదవిలో ఉన్న ఒక తెలుగు పెద్ద సాయంతో ఈడీలో 13 ఏళ్ల పాటు తిష్టవేసి టీడీపీ ప్రత్యర్థులపై కక్షసాధించడం, టీడీపీ నేతల కేసులను నీరు గార్చడమే పనిగా బొల్లినేని గాంధీ పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ హోదాలో ఉంటూ చంద్రబాబుకు రాజకీయంగా […]

అసలీ బొల్లినేని గాంధీ ఎవరు?
X

వంద గొడ్లను తిన్న రాబంధు ఒక్క గాలి వానకు కూలుతుందంటారు. ఇప్పుడు మాజీ ఈడీ అధికారి బొల్లినేని గాంధీ విషయంలోనూ అదే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చంద్రబాబుతో పాటు… కేంద్రంలో పెద్ద పదవిలో ఉన్న ఒక తెలుగు పెద్ద సాయంతో ఈడీలో 13 ఏళ్ల పాటు తిష్టవేసి టీడీపీ ప్రత్యర్థులపై కక్షసాధించడం, టీడీపీ నేతల కేసులను నీరు గార్చడమే పనిగా బొల్లినేని గాంధీ పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ హోదాలో ఉంటూ చంద్రబాబుకు రాజకీయంగా పనికొచ్చే, ప్రత్యర్ధులను దెబ్బతీసే అనేక పనులకు గాంధీ పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సీబీఐ దాడులు చేయడం, మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్ల విలువైన ఆస్తులను ఆయన కూడగట్టినట్టు తేలడంతో బొల్లినేని బాగోతం మరోసారి తెరపైకి వచ్చింది.

అక్రమాస్తుల కేసులో బొల్లినేనితో పాటు ఆయన భార్య శిరీషాపైనా కేసు నమోదు చేశారు. అమరావతి ప్రాంతంలో భారీగా ఆయన భూములు కూడబెట్టినట్టు చెబుతున్నారు.

హైదరాబాద్‌ వేదికగా… ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు సుజనాచౌదరి కేసును ఈయనే పర్యవేక్షించారు. సుజానా కంపెనీల అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలు కనిపిస్తున్నా చర్యలు తీసుకోలేదు.

అదే సమయంలో జగన్‌ కేసు విషయంలో మాత్రం చిత్రవిచిత్రంగా వ్యవహరించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీని ఏఅంశంలోనైనా ఇరుకున పెడితే తక్షణమే జగన్‌ కేసులో పలానా ఆస్తి జప్తు అంటూ ఈడీ ట్వీట్ చేసేది. అది బాబు గారి కోసం ఈ బొల్లినేని గారు నడిపిన కథే అన్నది చాలా మంది ఆరోపణ.

ఈబొల్లినేని గాంధీ చౌదరితో పాటు టీడీపీ సీనియర్ నేత దేవేందర్‌ గౌడ్‌ అల్లుడు ఉమాశంకర్‌గౌడ్‌ కూడా…. ఇద్దరూ కలిసి చంద్రబాబు చెప్పినట్టు ఈడీని నడిపారన్నది ప్రధాన ఆరోపణ.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జగన్‌ దూకుడు మరీ ఎక్కువైన ఓ దశలో ఏకంగా వైఎస్‌ భారతి పేరును ఈ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నించి ఆమె పేరును బొల్లినేని గాంధీ తెరపైకి తెచ్చారు. సీబీఐ చార్జిషీట్‌లో పేరు లేకపోయినా జగన్ ఆస్తుల కేసులో వైఎస్ భారతికి ప్రమేయం ఉందంటూ ప్రచారం చేశాడు. వైఎస్‌ భారతి పేరును ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నిస్తే ఇప్పుడు సాక్షి మీడియాకు ఆమె చైర్ పర్సన్ కదా అంటూ అడ్డదిడ్డమైన వాదన చేశారు.

ఇలా చంద్రబాబుకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారీ… జగన్‌కు వ్యతిరేకంగా ఈడీ ట్విట్టర్లో అటాచ్‌ అంటూ ట్వీట్ కనిపించేది ఈ బొల్లినేని గాంధీ మహిమ వల్లే అంటున్నారు.

First Published:  9 July 2019 9:02 PM GMT
Next Story