Telugu Global
NEWS

ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి

గడిచిన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి వెళ్లిందన్నారు ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. గణాంకాలతో సహా ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించారు. శ్వేతపత్రం విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో అప్పులు భారీగా పెరిగిపోయాయని బుగ్గన వివరించారు. చంద్రబాబు దిగిపోయే సరికి…. సాధారణ అప్పు = 2 లక్షల 58వేల కోట్లు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు= 58వేల కోట్లు(ఈ డబ్బులను ఎక్కువగా ఎన్నికల పథకాలకు మళ్లింపు) విద్యుత్‌ […]

ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి
X

గడిచిన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి వెళ్లిందన్నారు ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. గణాంకాలతో సహా ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించారు. శ్వేతపత్రం విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో అప్పులు భారీగా పెరిగిపోయాయని బుగ్గన వివరించారు.

చంద్రబాబు దిగిపోయే సరికి….

సాధారణ అప్పు = 2 లక్షల 58వేల కోట్లు.
కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు= 58వేల కోట్లు(ఈ డబ్బులను ఎక్కువగా ఎన్నికల పథకాలకు మళ్లింపు)
విద్యుత్‌ రంగంలో అప్పు = 18వేల 375 కోట్లు
సివిల్ సప్లయిస్‌లో అప్పు =10వేల కోట్లు
వివిధ పెండింగ్ బిల్లులు =18వేల కోట్లు
మొత్తం కలిపితే అప్పు= 3లక్షల 62వేల కోట్లు

వ్యవసాయ రంగంలో

1999-2004 మధ్య వృద్థిరేటు= 3.66 శాతం
2004-2009 మధ్య కాలంలో వృద్ధిరేటు =6.14 శాతం
2009-2014 మధ్య కాలంలో వృద్ధి రేటు = 4.18 శాతం
2014-2019 మధ్య కాలంలో వృద్ధిరేటు= 11 శాతం ( చంద్రబాబు చెప్పిన లెక్క)

కానీ చంద్రబాబు హయాంలో వ్యవసాయ వృద్దిరేటు మైనస్‌లో ఉంది… అసలు లెక్కలు

2014-2015 మధ్య కాలంలో వ్యవసాయ వృద్ది రేటు= -0.35 శాతం
2014-2015 మధ్య కాలంలో వ్యవసాయ వృద్ది రేటు= -0.35 శాతం
2015-2016 మధ్య కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు= – 12. 28 శాతం
2016- 2017 మధ్య కాలంలో వ్యవసాయ వృద్ధిరేటు= -7.36 శాతం
2017-2018 మధ్య కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు= ఇంకా పరిశీలనలో ఉంది

పరిశ్రమల వృద్ధి రేటు

1999-2004 మధ్య కాలంలో వృద్ధి రేటు=6.03 శాతం
2004-2009 మధ్య కాలంలో వృద్ధి రేటు=11 శాతం
2009-2014 మధ్య కాలంలో వృద్ధి రేటు=2.58 శాతం
2014-2019 మధ్య కాలంలో వృద్ధి రేటు= 10.74 శాతం( చంద్రబాబు చెప్పిన ఈ లెక్క అవాస్తమంటున్న బుగ్గన…. పరిశ్రమలు కొత్తగా వచ్చి ఉంటే విద్యుత్ వినియోగం పెరగకుండా అలాగే ఎందుకుందన్నది బుగ్గన ప్రశ్న)

2014-2019 మధ్య లెక్కల్లో చాలా లోపాలు, అవాస్తవాలు ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వివరించారు. వ్యవసాయ వృద్ధి రేటు భారీ స్థాయిలో ఉండడానికి కారణం మత్స్య సంపద పెరిగిందని గత ప్రభుత్వం చెప్పుకొచ్చిందన్నారు.

కానీ చేపల పరిశ్రమ ఎంత?, దాని వల్ల మొత్తం వ్యవసాయ వృద్ది రేటు పెరిగే అవకాశం ఎంత ఉంటుందన్న కోణంలో అసలు లెక్కలు తాము తీశామని వివరించారు. వాస్తవ లెక్కల ఆధారంగా వ్యవసాయ వృద్ధి రేటు లెక్కలు తీయగా పెరుగుదల మైనస్‌లో ఉందన్నారు.

వ్యవసాయ వృద్దిరేటు తగ్గుతూ వస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గొర్రెల వల్ల, చేపల వల్ల పెరిగిందంటూ అవాస్తవాలు చెప్పిందన్నారు.

2013-17 మధ్య దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బం = 9 శాతం నుంచి 4. 5శాతానికి తగ్గింది… ఏపీలో మాత్రం 2013-2017మధ్య కాలంలో ఏపీలో విపరీతంగా ధరలు పెరిగాయని బుగ్గన వివరించారు.

1990 వరకు రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం ఏపీ… 1990-2003 కి రెవెన్యూ లోటు 21 వేల కోట్లు.. 2004 నుంచి 2014 వరకు రెవెన్యూలోటును పూడ్చుకుంటూ వస్తే రెవెన్యూ లోటు 21 వేల కోట్ల నుంచి 11 వేలకోట్లకు తగ్గింది…కానీ తిరిగి ఇప్పుడు రెవెన్యూ లోటు ఐదేళ్లలో 66వేల కోట్లకు వెళ్లిపోయిందని బుగ్గన వివరించారు. ఐదేళ్లలో అప్పులుగా తెచ్చిన మొత్తాన్ని తిరిగి ఆదాయం వచ్చే పనులకు కేటాయించలేదు.

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కూడా పట్టించుకోలేదు. స్థూల ఉత్పత్తిలో మూడుశాతానికి మించి అప్పు తీసుకురాకూడదు. 2013-14లో 2.11 శాతం మాత్రమే అప్పు తీసుకురాగా…. 2015-16లో అప్పు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనను దాటేసి 3.67 శాతానికి చేరింది…. 2016-17లో 4.42 శాతం అప్పు తెచ్చారని… 2017-18లో 4.08 శాతం అప్పు తెచ్చారని బుగ్గన వెల్లడించారు.

First Published:  10 July 2019 10:50 AM GMT
Next Story