మహిళను ముగ్గులోకి దింపేందుకు షమీ ప్రయత్నం

క్రికెటర్‌ మహ్మద్‌ షమీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే భార్య చేత అనేక ఆరోపణలు ఎదుర్కొన్న షమీ ఇప్పుడు ఒక మహిళకు మెసేజ్ చేశాడు. ఏ మాత్రం పరిచయం లేని షమీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనకు పదేపదే మెసేజ్‌లు పంపిస్తున్నాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘1.4 మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్న గొప్ప క్రికెటర్‌ నాకే ఎందుకు మెసేజ్‌ చేస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా?’ అని మెసేజ్‌ స్క్రీన్‌ షాట్స్‌ జత చేసి ప్రశ్నించింది.

షమీ పెట్టిన మెసేజ్‌ లలో గుడ్ ఆప్టర్‌నూన్‌ అన్న పదం మాత్రమే ఉన్నా… ఆమెను మెల్లగా తన వైపు ఆకర్షించేందుకు షమీ ఈ తరహా ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

షమీ తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. భార్య చేత ఆరోపణలు ఎదుర్కొని ఒక దశలో క్రికెట్ కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టుకున్న తర్వాత కూడా బుద్దిరాలేదా షమీ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. షమీ స్త్రీ లోలుడు అనేందుకు ఇదే నిదర్శనమంటున్నారు.

షమీ వరల్డ్ కప్‌లో మంచి ప్రతిభే కనబరిచాడు. 4 మ్యాచ్‌లు ఆడిన షమీ 14 వికెట్లు తీశాడు. ఆఫ్ఘన్‌ మ్యాచ్‌ లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. భువనేశ్వర్‌ గాయం కారణంగా షమీ తుది జట్టులోకి వచ్చాడు. భుననేశ్వర్ తిరిగి రావడంతో షమీ డ్రెస్సింగ్ రూంకు పరిమితమయ్యాడు.