నాగ్ అశ్విన్… దారెటు?

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టి పెద్ద విజయం సాధించి, ఆ తర్వాత మహానటి సినిమా ద్వారా తన సక్సెస్ రేంజ్ ని అమాంతం పెంచేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్.

మహానటి వంటి పెద్ద విజయం తర్వాత నాగ్ అశ్విన్ ఏం చేస్తాడా అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. మహానటి విడుదల సమయం లో మాత్రం ఈ దర్శకుడు తదుపరి చిత్రాన్ని చిరంజీవి తో చేస్తారు అనే వార్తలు వచ్చాయి.. కానీ నేటి వరకు ఆ విషయం మీద ఒక క్లారిటీ లేదు.

అయితే చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. కాకపోతే ఈ దశ లో నాగ్ అశ్విన్ తో సినిమా అంటే కష్టమే. అంతే కాకుండా త్రివిక్రమ్ కూడా చిరంజీవి తో పని చేయడానికి సిద్ధం గా ఉన్నాడు. ఇది పక్కన పెడితే నాగ్ అశ్విన్ ఇప్పుడు ఏ హీరో తో సినిమా చేస్తాడు అని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

కొంత మంది యువ హీరోలు ఎవరో ఒకళ్ళ తో సినిమా చేస్తాడు అంటుంటే, కొంత మంది మాత్రం వెబ్ సిరీస్ చేస్తాడు అని అంటున్నారు. చివరికి ఏం అవుతుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.