వింబుల్డన్ లో వందో విజయానికి ఫెదరర్ రెడీ

  • సెమీస్ లో చోటు కోసం ఫెదరర్ తో నిషికోరీ ఢీ
  • కెరియర్ లో 55వ గ్రాండ్ స్లామ్ పోరు

గ్రాండ్ స్లామ్ కింగ్, గ్రాస్ కోర్ట్ టెన్నిస్ బాస్ రోజర్ ఫెదరర్… తన కెరియర్ లో వింబుల్డన్ సింగిల్స్ వందో విజయానికి ఉరకలేస్తున్నాడు.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే క్వార్టర్స్ సమరంలో జపాన్ టాప్ స్టార్ కియా నిషికోరీతో తలపడనున్నాడు.

37 ఏళ్ల వయసులో 9వ వింబుల్డన్ టైటిల్ కు గురిపెట్టిన రెండో సీడ్ ఫెదరర్..ఇప్పటి వరకూ 99 విజయాలు సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో నిషికోరీని ఓడించగలిగితేనే వింబుల్డన్ విజయాల శతకాన్ని పూర్తి చేయగలుగుతాడు.

వింబుల్డన్ లో 17వ, కెరియర్ లో 55వ గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్ఆడుతున్న ఫెదరర్ ఇప్పటికే లేటు వయసులో వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఆటగాడిగా జిమ్మీ కానర్స్ సరసన చోటు సంపాదించాడు.

నిషికోరీ ప్రత్యర్థిగా…ఫెదరర్ కు 7 విజయాలు, 3 పరాజయాల రికార్డు ఉంది. ఫెదరర్ సెమీస్ చేరే పక్షంలో రెండో సీడ్ నడాల్ తో తలపడాల్సి ఉంది.