సాహో…. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ?

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమా ద్వారా శ్రద్ధ తెలుగు లో కి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా నిర్మాణం చివరి దశలోకి రావడం తో ఇక ప్రమోషన్స్ మీద దృష్టి పెడుతున్నారు దర్శక నిర్మాతలు. సినిమా మొదలు ఆయ్యే దగ్గర నుండి విడుదల ఆయె వరకు బజ్ మెంటైన్ చేస్తూ ఉంటేనే థియేటర్ల లో సినిమా విజయం సాధించే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ప్రమోషన్స్ విషయం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ముఖ్యమైన అంశం. ఈ సినిమా కి సంబందించినంత వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై లో చేయాలా లేక హైదరాబాద్ లో చేయాలా అనే సందిగ్దంలో చిత్ర యూనిట్ ఉందట. ఈ విషయం మీద ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదని వారు చెప్తున్నారు. ముంబై నుండి సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటం తో, ఈవెంట్ ని అక్కడ చేస్తే బాగుంటుంది అని కొంత మంది అభిప్రాయపడుతున్నారట. 

అయితే ఇక్కడ చేయకపోతే వ్యతిరేకత వస్తుందేమోనని కూడా మరొకొంతమంది యూనిట్ కి సలహా ఇస్తున్నారట.