‘ఓ బేబీ’ పై నమ్మకం లేదట…. కానీ ఇప్పుడు….

ఓ బేబీ విజయం ప్రస్తుతం హీరోయిన్ సమంత కి ఎనలేని సంతోషం తో పాటు నమ్మకం కూడా ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ని సమంత చాలా స్పెషల్ సినిమా లాగా ట్రీట్ చేసిన విషయం తెలిసిందే.

సినిమా ఆద్యంతం తన ఎనర్జీ ని నింపి సినిమా ని తన భుజాల పై మోస్తూ విజయ పథం లోకి నడిపించింది. అయితే ఈ విషయం లో దర్శకురాలు నందిని రెడ్డి కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. సినిమా ఆల్రెడీ కొరియా లో వచ్చినా, దానికి కావలసినట్టు మార్పులు చేసి ఎంతో చక్కగా తెలుగు ప్రేక్షకుల కి నచ్చే విధం గా సినిమా ని తీర్చిదిద్దారు.

అయితే సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఈ సినిమా రావడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సురేష్ బాబు కి ముందుగా ఈ సినిమా ఆడుతుంది అనే నమ్మకం లేదట…. కానీ ఈ రోజు అయన చాలా సంతోషం గా ఉన్నాడట.

అందుకే ఈ కాంబినేషన్ మీద హిట్ టాక్ ఉన్నప్పుడే ఇంకో సినిమా చేసి అందరినీ మెప్పించాలని చూస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.