వరుస ఫెయిల్యూర్స్….. డిప్రెషన్ కి లోనయ్యాను….

వరుస డిజాస్టర్ లతో యువ హీరో సందీప్ కిషన్ మార్కెట్ బాగా పడి పోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘నెక్స్ట్ ఏంటి’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న సందీప్ కిషన్ ఇప్పుడు ‘నిను వీడని నీడను నేనే’ అనే హారర్ థ్రిల్లర్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సందీప్ కిషన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరుస ఫెయిల్యూర్స్ వలన తాను బోర్డర్ లైన్ డిప్రెషన్ కి గురి అయ్యాను అని చెప్పాడు.

“నేను నా వర్క్ కి సంబంధించిన విషయాలు ఇంట్లో వాళ్లకి చెప్పను. నేను అన్నీ పంచుకునే ఏకైక వ్యక్తి నా సిస్టర్ మాత్రమే ‘స్నేహ గీతం’ సినిమా విడుదలయ్యే సమయానికి సందీప్ కిషన్ అనే పేరు ఎవరికీ తెలీదు. ఆ తర్వాత వరుసగా మూడు భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చాను. హిందీ తమిళ భాషల్లో నేను అనుకున్న విధంగా పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కింది… కానీ తెలుగులో మాత్రం అలాంటి సినిమా ఇంకా దొరకలేదు. నా సొంత గడ్డపై నేను ఓడిపోయాను అనే భావన నాకు కలిగింది” అని చెప్పిన సందీప్ కిషన్ ఫెయిల్యూర్స్ తో స్క్రిప్ట్ సెలెక్ట్ చేసే విషయంలో చాలా నేర్చుకున్నానని అందుకే ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ఫైనలైజ్ చేసేముందు దాదాపు 30 దాకా కథలు విన్నాను అని చెప్పుకొచ్చాడు.