Telugu Global
NEWS

వైసీపీ నుంచి 24 మంది ఎంపీలు గెలిచారు " మళ్లీ పప్పులో... లోకేష్‌

ట్విట్టర్‌లో ఈ మధ్య నారా లోకేష్ విరుచుకుపడుతున్నారు. వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే ఆ ట్వీట్లు లోకేష్ చేయడం లేదు. కొందరు సిబ్బందిని పెట్టుకుని వారితో చేయిస్తున్నారని… ట్వీట్లు పెట్టేంత తెలివితేటలు నారా లోకేష్‌కు లేవని వైసీపీ వాళ్లు విమర్శిస్తూ వస్తున్నారు. అసలు లోకేష్ ట్విట్టర్‌లోనే ఉంటారా? బయటకు రారా? అని మరికొందరు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పట్టిసీమ హారతి అంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఒక టీవీ చానల్‌తో మాట్లాడిన […]

వైసీపీ నుంచి 24 మంది ఎంపీలు గెలిచారు  మళ్లీ పప్పులో... లోకేష్‌
X

ట్విట్టర్‌లో ఈ మధ్య నారా లోకేష్ విరుచుకుపడుతున్నారు. వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే ఆ ట్వీట్లు లోకేష్ చేయడం లేదు. కొందరు సిబ్బందిని పెట్టుకుని వారితో చేయిస్తున్నారని… ట్వీట్లు పెట్టేంత తెలివితేటలు నారా లోకేష్‌కు లేవని వైసీపీ వాళ్లు విమర్శిస్తూ వస్తున్నారు. అసలు లోకేష్ ట్విట్టర్‌లోనే ఉంటారా? బయటకు రారా? అని మరికొందరు ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో నారా లోకేష్ పట్టిసీమ హారతి అంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఒక టీవీ చానల్‌తో మాట్లాడిన నారా లోకేష్‌… తన మేధావి తనాన్ని ప్రదర్శించబోయి దొరికిపోయాడు.

అసలు రైతు రుణమాఫీ అన్నది మీ తండ్రి చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీ, దాన్ని మీరు మీ హయాంలో నెరవేర్చకుండా ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేయాలని ఎలా డిమాండ్ చేస్తారు అని ప్రశ్నించగా… సూటిగా సమాధానం చెప్పలేక రుణమాఫీకి, ఫించన్లకు లింక్‌ పెట్టి ఏదో చెప్పబోయారు.

గత ప్రభుత్వం విత్తనాలను సిద్ధం చేయాల్సి ఉన్నా…. ఆ పని చేయకపోవడం వల్లే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. వైసీపీ తరపున 24 మంది ఎంపీలు గెలిచారని… ప్రత్యేక హోదా కోసం మోడీపై ఎందుకు పోరాటం చేయడం లేదని ఎదురు ప్రశ్నించారు లోకేష్.

ఇంకా దొరకలేదే చినబాబు అనుకుంటుండగానే ఇక్కడే లోకేష్ దొరికిపోయారు. వైసీపీ తరపున 22 మంది ఎంపీలు గెలిచారు. టీడీపీ తరపున ముగ్గురు గెలిచారు. కానీ లోకేష్ మాత్రం వైసీపీ తరపున 24 మంది ఎంపీలు గెలిచారని సెలవిచ్చారు.

ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎల్లోమీడియా ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఉపయోగం ఉండదన్నది లోకేష్ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!. ఫాపం టీడీపీ భజన బృందాలు…. కవర్ చేయలేక చస్తున్నాయి.

First Published:  9 July 2019 11:36 PM GMT
Next Story