డబ్బింగ్ పనుల్లో బన్నీ…. అందుకేనట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సినిమా షూటింగ్ కూడా కేవలం రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తి అయింది. ఇంకా పూజా హెగ్డే పూర్తిగా ఈ సినిమా లో పాల్గొనలేదు. తను బాలీవుడ్ లో చేస్తున్న సినిమా పూర్తి అయితే గానీ ఈ సినిమా కి డేట్స్ సర్దుబాటు చేయలేదు.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా కి అప్పుడే డబ్బింగ్ మొదలు పెట్టేసారు. నిన్ననే సినిమాని సంక్రాంతి కి విడుదల చేస్తాం అని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. లాస్ట్ మినిట్ లో అనవసరమైన హడావుడి పడే కన్నా టైం ఉన్నప్పుడే మెల్లగా డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టుకొని…. చివరల్లో సినీమా ప్రమోషన్స్ పై ఎక్కవగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందనేది… నిర్మాతల అభిప్రాయమట.

ఈ సినిమా ని గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రసాద్ లాబ్స్ లో సినిమా కి సంబందించిన డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.