కే ఏ పాల్ బయోపిక్… కనిపించనున్న ట్రంప్, ఏంజెలీనా జోలీ

ఈ మధ్య కాలంలో ఒక దాని తర్వాత ఒక బయోపిక్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో కే ఏ పాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కేఏ పాల్ పాత్రలో ప్రముఖ కమెడియన్ సునీల్ నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఈ సినిమాలో ట్రంప్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని తెలుస్తోంది. అయితే ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాదు ఆయన లాగే ఉండే ఒక నటుడట. ట్రంప్ పోలికలు ఉన్న ఒక నటుడు ఈ సినిమాలో…. ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సునీల్ అమెరికాలో ఈ సినిమా లోని తన పాత్ర కోసం మేకోవర్ తో బిజీగా ఉన్నాడట. కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ముందు వరకు సోషల్ మీడియాలో కేఏ పాల్ చేసిన కామెడీ వైరల్ గా మారింది. ఇప్పుడు కేఏ పాల్ పైన సినిమా అంటే ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ సినిమాలో నార్త్ కొరియా అధ్యకుడు కిమ్ జామ్ ఉన్, హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలీ లాగా వుండే ఆర్టిస్ట్ లు కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.