అనుష్క తో…. మళ్ళీ నాగార్జున?

అక్కినేని హీరోలకి అనుష్క శెట్టి ఒక లక్కీ హీరోయిన్ అని చెప్పుకోచ్చు. నాగార్జున హీరో గా నటించిన సూపర్ సినిమా తో అనుష్క అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగార్జున తో పలు సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది.

అయితే నాగార్జున-అనుష్క జంట అంటే అక్కినేని అభిమానులకి ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఈ హీరో-హీరోయిన్ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలి అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.

ప్రస్తుతం అక్కినేని నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం బంగార్రాజు లో హీరోయిన్స్ ఎంపిక జరుగుతుంది. ఒక హీరోయిన్ ఓకే అయింది.. కానీ సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

అయితే అభిమానులు చాలా మంది నాగార్జున సరసన అనుష్క ని తీసుకోవాలని చెబుతున్నారు… సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే నాగార్జున కూడా అనుష్క ని అప్రోచ్ అవ్వమని తన టీమ్ కి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో రానున్న ఈ సినిమా ని నాగార్జున తన సొంత బ్యానర్ పై నిర్మించనున్నాడు. ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.