అంచనాలు పెంచేస్తున్న…. ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మళ్ళీ తన ‘గీతగోవిందం’ కోస్టార్ రష్మీక మందన్న తో కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో రాబోతున్నాడు.

భరత్ కమ్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ వీడియో… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ల పాత్రలు ఈ సినిమా లో ఎలా ఉండబోతున్నాయో… ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

విజయ్… బాబీ అనే స్టూడెంట్ పాత్ర లో కనిపించబోతుంటే, రష్మీక… లిల్లి అనే స్టేట్ క్రికెట్ ప్లేయర్ లా కనిపిస్తుంది. సినిమా అంతా వాళ్ల పరిచయం, ప్రేమ, వాళ్ళ ప్రొఫెషన్ వల్ల వాళ్ళ మధ్య జరిగిన గొడవలు…. వంటి వాటి చుట్టూ తిరుగుతుంది అని చెప్పచ్చు. ఎప్పటిలానే రష్మీక, విజయ్ ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

యష్ రంగినేని మధుర మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగులోనే కాక మలయాళం తమిళ మరియు కన్నడ భాషల్లో జూలై 26న విడుదల కాబోతోంది.