చంద్రబాబు అనే వాడు ఎంత? బాలకృష్ణ బతుకెంత?

చంద్రబాబుపై, ఆయన బామ్మర్ధి బాలకృష్ణపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు. పొత్తులపై చంద్రబాబు చేస్తున్న ప్రకటనల పట్ల, గతంలో మోడీని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు.

”తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోకూడదు అన్నది పార్టీ నిర్ణయం… అమిత్ షా కూడా అదే చెప్పారు. చంద్రబాబు ఎవడు? ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు… ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు అని చెప్పడానికి వాడు ఎవడు?.

మర్యాదగా ఉంటే మర్యాదగా మాట్లాడుతాం. మర్యాద తప్పి… రోజూ అభాండాలు వేస్తే ఇలాగే మాట్లాడుతాం. మా పార్టీని బలహీనపరిచేందుకు లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తే బాధ ఉండదా?. వాడు అని పిలిపించుకునే స్థాయికి చంద్రబాబే దిగజారాడు. నిజంగానే వాడు ఎవడు? మా పార్టీ గురించి మాట్లాడడానికి?.

వాడు అంటేనే అంత బాధ కలిగితే వాళ్లు మాపై చేసిన ప్రచారం గురించి ఏం చెబుతారు?. సంస్కారం లేని చంద్రబాబును ఏమన్నా తప్పులేదు. నమ్మించి ద్రోహం చేసిన వాడిని ఏమైనా అనొచ్చు.

ఒక ముఖ్యమంత్రిగా వేదికపై చంద్రబాబు కూర్చుని…. ఒక సభలో బాలకృష్ణ చేత, మరో సభలో యాక్టర్ దివ్యవాణి చేత మోడీని దారుణంగా తిట్టించాడు. బాలకృష్ణ మోడీ గురించి ఏం మాట్లాడాడో గుర్తు తెచ్చుకోండి. ఆఫ్ట్రాల్‌ బాలకృష్ణ బతుకెంతా?. అతడు ప్రధాని గురించి ఇష్టానుసారం మాట్లాడుతాడా?. మేం చంద్రబాబును వాడు అంటేనే బాధగా ఉందా?. చంద్రబాబు, టీడీపీ నేతలకు సంస్కారం లేదు కాబట్టి వారికి ఈ తరహా భాష మాట్లాడడమే కరెక్ట్” అని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.