Telugu Global
NEWS

కూల్చివేతలు.... కేసీఆర్ కు షాకుల మీద షాకులు

తెలంగాణ సీఎం కేసీఆర్ కలలు నెరవేరేలా కనిపించడం లేదు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేసి కొత్త అసెంబ్లీ, సచివాలయాలను నిర్మించాలని కేసీఆర్ యోచించారు. శంకుస్థాపనలు కూడా చేశారు. అయితే ఆదిలోనే హంసపాదులా తెలంగాణ కాంగ్రెస్ , ప్రతిపక్షాలు పాత సచివాలయం కూల్చివేతలపై ఆందోళనకు దిగాయి. ప్రజాసంఘాలు కూడా కలిసి రావడంతో ఇదో ఉద్యమంలా మారింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఏడు పిటీషన్లు ఇప్పటివరకు దాఖలయ్యాయి. తాజాగా కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. […]

కూల్చివేతలు.... కేసీఆర్ కు షాకుల మీద షాకులు
X

తెలంగాణ సీఎం కేసీఆర్ కలలు నెరవేరేలా కనిపించడం లేదు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేసి కొత్త అసెంబ్లీ, సచివాలయాలను నిర్మించాలని కేసీఆర్ యోచించారు. శంకుస్థాపనలు కూడా చేశారు.

అయితే ఆదిలోనే హంసపాదులా తెలంగాణ కాంగ్రెస్ , ప్రతిపక్షాలు పాత సచివాలయం కూల్చివేతలపై ఆందోళనకు దిగాయి. ప్రజాసంఘాలు కూడా కలిసి రావడంతో ఇదో ఉద్యమంలా మారింది.

ఇక టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఏడు పిటీషన్లు ఇప్పటివరకు దాఖలయ్యాయి. తాజాగా కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. ఎర్రమంజిల్ లోని పురాతన భవనం కూల్చివేతపై నిజాం వారసులు కోర్టుకెక్కారు. దాన్ని 1949లోనే ప్రభుత్వానికి అప్పగించినా.. అందులోని 12 ఎకరాలకు సంబంధించి తమకు పరిహారం రావాల్సి ఉందని…. అది ఇచ్చేవరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశాలు ఇవ్వాలన్ని హైకోర్టును కోరారు.

వాదనలు విన్న హైకోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎర్రమంజిల్ లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇలా కేసీఆర్ దసరాలోపు అసెంబ్లీ, కొత్త సచివాలయ నిర్మాణాలకు సిద్ధమవ్వడం.. పలువురు కోర్టుకెక్కడంతో వాటి నిర్మాణాలు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. చూడాలి మరి… ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత సాధ్యపడుతుందా?… కొత్త సచివాలయం నిర్మాణం పూర్తవుతుందా అనేది.?

First Published:  11 July 2019 3:47 AM GMT
Next Story