ఇదెక్కడి అన్యాయం…. కేటీఆర్ ట్వీట్ దుమారం….

రెండోసారి గద్దెనెక్కాక దేశంలో బీజేపీని ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేకుండా పోయింది. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ కూడా ఆర్థిక మంత్రిగా ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

అయితే తెలంగాణకు, అందునా దక్షిణాదికి రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరగడంపై ఏ రాష్ట్రం వారు కూడా నోరు తెరిచి ఇప్పటి వరకు పెద్దగా విమర్శించలేదు.

కాగా తాజాగా ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుతిమెత్తగా సూటిగా పంచ్ లు వేశారు. తెలంగాణకు, సౌత్ ఇండియాకు ఏమిచ్చారని దక్షిణాది ఆర్థిక మంత్రిని ట్విట్టర్ ద్వారా కడిగిపారేశారు.

కేటీఆర్ ఈరోజు ట్వీట్ చేస్తూ ‘నో రైల్వే లైన్.. నో న్యూ ట్రెయిన్స్ , నో సర్వేస్, నో బుల్లెట్ రైల్, నో హైస్పీడ్ రైల్.. అంతా గుజరాత్, ముంబై, డిల్లీకేనా.? దక్షిణాదికి, తెలంగాణకు ఏమిచ్చారో బడ్జెట్ లో చెప్పాలని ప్రశ్నించారు.

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టాక ఎవ్వరూ గొంతెత్తి మాట్లాడిన దాఖలాలు లేవు. చాలా మందిని ఈడీ, ఐటీ దాడులతో భయపెడుతున్న బీజేపీకి ఎదురెళ్లడం ఇష్టం లేక అందరూ సైలెంట్ గా ఉన్నారు. కానీ కేటీఆర్ మాత్రం తాజాగా చేసిన ట్వీట్ తో… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వల్ల దక్షిణాదికి జరిగిన అన్యాయంపై నిలదీశారు.