Telugu Global
NEWS

రాష్ట్రాన్ని దోచిన చంద్రబాబుకు శిక్ష తప్పదు " వైఎస్ఆర్ సీపీ నేత రవిచంద్రారెడ్డి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవిచంద్రారెడ్డి విమర్శించారు. “చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగ. ఈ నేరంలో ఆయనకు శిక్ష తప్పదు” అని రవిచంద్ర అన్నారు. రాష్ట్ర్ర ఆర్ధిక పరిస్థితిపై ఓ ఛానెల్ లో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న రవిచంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై తమ ప్రభుత్వం 42 రోజులలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించామని, […]

రాష్ట్రాన్ని దోచిన చంద్రబాబుకు శిక్ష తప్పదు  వైఎస్ఆర్ సీపీ నేత రవిచంద్రారెడ్డి
X

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవిచంద్రారెడ్డి విమర్శించారు.

“చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగ. ఈ నేరంలో ఆయనకు శిక్ష తప్పదు” అని రవిచంద్ర అన్నారు. రాష్ట్ర్ర ఆర్ధిక పరిస్థితిపై ఓ ఛానెల్ లో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న రవిచంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై తమ ప్రభుత్వం 42 రోజులలో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించామని, ఆ కమిటీ త్వరలో ఓ నివేదిక ఇస్తుందని అన్నారు.

రాష్ట్రం నేడు ఆర్ధికంగా చితికి పోవడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, వ్యయాలపై నిగ్గు తేలుస్తామని, ఎక్కడ ఏ అవినీతి జరిగిందో సాక్ష్యాలతో సహా బయటపెడతామని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిపై ఆధారాలు తప్పక దొరుకుతాయని, తెలుగుదేశం పార్టీకి చెందిన కరడు కట్టిన అభిమానులు ఎంత గింజుకున్నా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతికి శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు 29 వేల కోట్ల రూపాయలు పసుపు కుంకుమ పథకానికి ఖర్చు చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది అక్షరాల 60 వేల కోట్ల రూపాయలు అని రవిచంద్రారెడ్డి విమర్శించారు.

చర్చా గోష్టిలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు సి.హెచ్.వి.ఎం.క్రిష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవినీతిపై ప్రభుత్వం పూర్తి స్ధాయిలో వివరాలు బయటపెట్టాలని అన్నారు. చంద్రబాబు నాయుడి ఇంట్లో పాములు పట్టేందుకు 60 లక్షలు… గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు పట్టుకునేందుకు మరికొన్ని లక్షలు… విజయవాడలో దోమల నివారణ కోసం లక్షలు ఖర్చు చేశారని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఈ అవినీతిపై పూర్తిగా వివరాలు వెల్లడిస్తే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు.

“రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయడం మంచి పరిణామం. అయితే, గత ప్రభుత్వం చేసిన అవినీతిపై నిర్ధిష్టంగా లెక్కలు చెబితే బాగుంటుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

First Published:  10 July 2019 11:49 PM GMT
Next Story