హాలీవుడ్ అవకాశాన్ని వదులుకున్న విక్రమ్…. కారణం ఇదే…

ఎవరికైనా హాలీవుడ్ సినిమా లో కనిపించాలనే ఆశ ఉంటుంది. అది సహజం. తెలుగు లో అయినా లేదా ఇతర భాషల్లో అయినా ఎంత పేరు సంపాదించినా, హాలీవుడ్ సినిమా లో ఒక చిన్న పాత్ర చేసినా చాలు…. మన లెవెల్ పెరిగింది అనే భావన వస్తుంది.

అందుకే చాలా మంది నటులు ఎప్పుడెప్పుడు హాలీవుడ్ అవకాశాలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.

అయితే తమిళ నటుడు చియాన్ విక్రమ్ మాత్రం హాలీవుడ్ ఆఫర్స్ కి దూరంగా ఉన్నాడు… ఆయన ని ఇటీవలే ఒక హాలీవుడ్ సినిమా దర్శక నిర్మాతలు అప్రోచ్ కాగా, ఆయన మాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పి…. ఆ అవకాశాన్ని వదులుకున్నాడట.

కేను రీవెస్ వంటి పెద్ద హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఈ సినిమా లో నటిస్తుందట. అయినా కానీ విక్రమ్ మాత్రం సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.

తాజా గా విక్రమ్…. ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పారు. అయితే ఈ సినిమా వదులుకోవడానికి ముఖ్య కారణం ఆ సినిమా లో తన పాత్ర కి పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడమేనట.