Telugu Global
NEWS

వింబుల్డన్ లో ఫెదరర్ విజయాల సెంచరీ

13వసారి వింబుల్డన్ సెమీస్ లో ఫెదరర్  గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్లో 45వసారి  క్వార్టర్ ఫైనల్లో నిషికోరీపై నెగ్గిన గ్రాండ్ స్లామ్ కింగ్ గ్రాండ్ స్లామ్ కింగ్, టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ 37 ఏళ్ల లేటు వయసులో సైతం రికార్డుల మోత మోగిస్తున్నాడు. వింబుల్డన్ చరిత్రలోనే 100 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. జిమ్మీ కానర్స్ తర్వాత…గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ చేరిన సీనియర్ ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ […]

వింబుల్డన్ లో ఫెదరర్ విజయాల సెంచరీ
X
  • 13వసారి వింబుల్డన్ సెమీస్ లో ఫెదరర్
  • గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్లో 45వసారి
  • క్వార్టర్ ఫైనల్లో నిషికోరీపై నెగ్గిన గ్రాండ్ స్లామ్ కింగ్

గ్రాండ్ స్లామ్ కింగ్, టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ 37 ఏళ్ల లేటు వయసులో సైతం రికార్డుల మోత మోగిస్తున్నాడు. వింబుల్డన్ చరిత్రలోనే 100 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. జిమ్మీ కానర్స్ తర్వాత…గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ చేరిన సీనియర్ ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు.

ఆల్ ఇంగ్లండ్ క్లబ్ గ్రాస్ కోర్టులో ముగిసిన క్వార్టర్ ఫైనల్లో 2వ సీడ్, 8 వింబుల్డన్ టైటిల్స్ విన్నర్ ఫెదరర్ గట్టి పోటీ ఎదుర్కొని ఆసియా ఆశాకిరణం, జపాన్ స్టార్ ప్లేయర్ కియా నిషికోరీని నాలుగుసెట్లలో అధిగమించాడు.

తొలిసెట్ ను 4-6తో చేజార్చుకొన్న ఫెదరర్ ఆ తర్వాతి మూడుసెట్లను 6-1, 6-4, 6-4తో సొంతం చేసుకోడం ద్వారా… వింబుల్డన్ గ్రాస్ కోర్టులో వంద విజయాల మైలురాయిని చేరాడు.

వింబుల్డన్ సెమీస్ లో 13వసారి…

గ్రాస్ కోర్టు టెన్నిస్ లో బాస్ గా పేరుపొందిన ఫెదరర్ తన కెరియర్ లో 9వ వింబుల్డన్ టైటిల్ కు రెండు విజయాల దూరంలో నిలిచాడు. అంతేకాదు.. కెరియర్ లో 13వసారి వింబుల్డన్ సెమీస్ చేరాడు. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లోనే ఫెదరర్ సెమీస్ చేరడం ఇది 45వసారి కావడం విశేషం.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీఫైనల్లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ తో ఫెదరర్ తలపడనున్నాడు. ఫెదరర్- నడాల్ తమ కెరియర్ లో 39వసారి ఢీ కొనబోతున్నారు. వింబుల్డన్ లో నాలుగోసారి సమరానికి సై అంటున్నారు.

సెమీఫైనల్లో స్పానిష్ బుల్…

మరో క్వార్టర్ ఫైనల్లో 3వ సీడ్ రాఫెల్ నడాల్ …వరుస సెట్లలో అమెరికా ఆటగాడు సామ్ క్వెరీని 7-5, 6-2, 6-2తో చిత్తు చేసి సెమీస్ సమరానికి సిద్ధమయ్యాడు.

జోకోవిచ్ 70వ విజయం

వింబుల్డన్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ 70వ విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో బెల్జియం ఆటగాడు డేవిడ్ గొఫిన్ ను 6-4, 6-0, 6-2తో చిత్తు చేశాడు. వింబుల్డన్ సెమీఫైనల్స్ చేరడం జోకోవిచ్ కు ఇది 9వసారి మాత్రమే.

First Published:  10 July 2019 8:10 PM GMT
Next Story