Telugu Global
NEWS

ప్రపంచకప్ లో నేడు రెండో సెమీస్ సమరం

టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ తో 5వ ర్యాంకర్ ఆసీస్ ఢీ ఎడ్జ్ బాస్టన్ వేదికగా తిరుగులేని ఇంగ్లండ్  30ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సెమీస్ లో ముఖాముఖీ సమరం ప్రపంచకప్ రెండో సెమీఫైనల్స్ కు…ఇంగ్లండ్ విజయాల అడ్డా ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే ఈ నాకౌట్ పోరులో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. వానగండం….. ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో […]

ప్రపంచకప్ లో నేడు రెండో సెమీస్ సమరం
X
  • టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ తో 5వ ర్యాంకర్ ఆసీస్ ఢీ
  • ఎడ్జ్ బాస్టన్ వేదికగా తిరుగులేని ఇంగ్లండ్
  • 30ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సెమీస్ లో ముఖాముఖీ సమరం

ప్రపంచకప్ రెండో సెమీఫైనల్స్ కు…ఇంగ్లండ్ విజయాల అడ్డా ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే ఈ నాకౌట్ పోరులో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

వానగండం…..

ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్ కు సైతం వానగండం పొంచిఉందని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది.

మూడుదశాబ్దాల విరామం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ సెమీస్ లో ఈ రెండుజట్లూ తలపడనుండడంతో..అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంగ్లండ్ విజయాల అడ్డా…

మ్యాచ్ వేదిక ఎడ్జ్ బాస్టన్ లో ఆతిథ్య ఇంగ్లండ్ కు తిరుగులేని రికార్డే ఉంది. 2014 నుంచి ఇదే గ్రౌండ్ వేదికగా ఆడిన 10కి 10 మ్యాచ్ ల్లోనూ నెగ్గిన ఘనత ఇంగ్లండ్ కు ఉంది.

ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్లో సైతం విజయం తమదేనన్న ధీమాతో ఇంగ్లండ్ ఉంది. అంతేకాదు…రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి ఇంగ్లండ్ బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.

మరోవైపు…ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచకప్ సొంతం చేసుకొన్న కంగారూటీమ్ ను గాయాలు వెంటాడుతున్నాయి. కీలక ఆటగాడు క్వాజా గాయంతో జట్టు కు దూరం కావడంతో హ్యాండ్స్ కోంబ్ కు చోటు కల్పించారు.

డాషింగ్ ఓపెనర్లు ఫించ్- వార్నర్ ఇచ్చే ఆరంభంపైనే ఆస్ట్రేలియా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

రెండుజట్ల టాపార్డర్, ఫాస్ట్ బౌలర్ల నడుమ ఆసక్తికరమైన పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టే ప్రపంచకప్ గెలుచుకోడం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు.

First Published:  10 July 2019 8:18 PM GMT
Next Story