డైలమా లో…. అను ఇమ్మానుయేల్

ఇండస్ట్రీ లో అవకాశం రావడం చాలా కష్టం అనుకునే సమయం లో వరుస అవకాశాల తో బిజీ అవ్వడమే కాకుండా…. అందరినీ ఎంతగానో ఆకర్షించేలా పాత్రలు ఎంపిక చేసుకొని…. అందరినీ మెప్పించాలనే ప్రయత్నం చేసింది అను ఇమ్మాన్యుయేల్.

కెరీర్ మొదట్లో మాములు సినిమాలే చేసినా…. ఒక దశ లో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ల తో పని చేసే సరికి మెగా హీరోయిన్ అనే టాగ్ ని కూడా ఈ భామ కి ఇచ్చేసారు.

అయితే అను ఇమ్మానుయేల్ కెరీర్ ఇప్పుడు డైలమా లో పడింది.

అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమా డిజాస్టర్లు…. ఆమెని వెంటాడుతున్నాయి. అను కి ఇదొక సమస్య గా మారింది.

కొంత మంది నిర్మాతలు, హీరోలు… గతంలో తన తో పని చేస్తామని మాట ఇచ్చిన వారు కూడా….. ఇప్పుడు ఈమెకి మార్కెట్ లేదని, ఐరన్ లెగ్ అని కామెంట్స్ చేస్తూ అనుని దూరం పెడుతున్నారని తెలుస్తోంది.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట ఈ హీరోయిన్ కి ప్రస్తుతం తను చేసే సినిమాలో అవకాశం ఇవ్వాలని అనుకున్నాడట… కానీ చివరి నిమిషం లో టీమ్ లో అందరూ పూజ వైపే మొగ్గు చూపడం తో…. అను మళ్ళీ అవకాశాల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.