Telugu Global
NEWS

చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై ట్విట్టర్ వేదికగా రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, ఇప్పుడు చెబుతున్న మాటలు గతంలో ఎందుకు రాలేదని రామచంద్రయ్య ప్రశ్నించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు […]

చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై ట్విట్టర్ వేదికగా రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, ఇప్పుడు చెబుతున్న మాటలు గతంలో ఎందుకు రాలేదని రామచంద్రయ్య ప్రశ్నించారు.

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకు చేయలేదని, ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని భావిస్తే ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు.

“చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతారు. తన స్వప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా ఆయన వెనుకాడరు” అని రామచంద్రయ్య ట్విట్టర్ లో పేర్కొన్నారు. తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడికి ఈ నాలుగు దశాబ్దాలలో చేసిన తప్పులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయోమోనని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.

“చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పులను తెలుసుకున్నా వాటిని అంగీకరించే ధైర్యం మాత్రం ఆయనకు లేదు” అని రామచంద్రయ్య స్పష్టం చేశారు.

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టింది తానే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం చేకూర్చే ఆల్మట్టిని ఎందుకు అడ్డుకోలేకపోయారని రామచంద్రయ్య ప్రశ్నించారు.

“విభజించడం.. వాడుకోవడం.. వదిలివేయడం.. ఈ మూడు లక్షణాలు చంద్రబాబునాయుడి సొంతం” అని రామచంద్రయ్య ట్విట్టర్ లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడులో ఉన్న ఈ మూడు లక్షణాల గురించి పార్టీలో సీనియర్లందరికీ తెలుసునని, చంద్రబాబు నాయుడి మాటల్లో ఒక్కటి నిజం ఉండదని వైఎస్సార్సీపీ నేత రామచంద్రయ్య స్పష్టం చేశారు.

First Published:  11 July 2019 8:30 PM GMT
Next Story