Telugu Global
NEWS

ఏమీ అనవద్దని సీఎం అంటున్నారు... ఎంతకాలం ఓర్చుకోవాలి...

అసెంబ్లీలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆవేదన చెందారు. ఎంత బర్నింగ్ ఇష్యూ ఉన్నా సరే గతంలో ఎన్నడూ ప్రశ్నోత్తరాలకు ముందు వాయిదా తీర్మానాన్ని అనుమతించలేదన్నారు. కానీ జగన్‌ మోహన్ రెడ్డి ప్రతిపక్షం డిమాండ్ చేసినట్టే చర్చకు అంగీకరించారని చెవిరెడ్డి గుర్తు చేశారు. కానీ టీడీపీ సభ్యులు మాత్రం వినడం కంటే గొడవ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో […]

ఏమీ అనవద్దని సీఎం అంటున్నారు... ఎంతకాలం ఓర్చుకోవాలి...
X

అసెంబ్లీలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆవేదన చెందారు. ఎంత బర్నింగ్ ఇష్యూ ఉన్నా సరే గతంలో ఎన్నడూ ప్రశ్నోత్తరాలకు ముందు వాయిదా తీర్మానాన్ని అనుమతించలేదన్నారు.

కానీ జగన్‌ మోహన్ రెడ్డి ప్రతిపక్షం డిమాండ్ చేసినట్టే చర్చకు అంగీకరించారని చెవిరెడ్డి గుర్తు చేశారు. కానీ టీడీపీ సభ్యులు మాత్రం వినడం కంటే గొడవ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

151 మంది ఎమ్మెల్యేలం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఒక్క ఎమ్మెల్యే కూడా అడ్డుపడలేదన్నారు. కానీ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ పదేపదే అడ్డుపడుతోందన్నారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇద్దరూ మిగిలిన ఎమ్మెల్యేలను లేచి గొడవ చేయండి అని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక విమానాలకే 630 కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర చంద్రబాబుది అని చెవిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి విషయంలో టీడీపీ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్నారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్‌మోహన్‌ రెడ్డిని టీడీపీ సభ్యులు ఇలాగే దూషించారన్నారు. అప్పుడు ఓర్చుకున్నాం… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓర్చుకోవాల్సి వస్తోందన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు పడి… అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాటలు పడాల్సి వస్తుంటే కడుపు మండుతోందన్నారు.

తమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష నేతలను ఏమీ అనవద్దు అని చెబుతున్నారని… ఇలా ఎంతకాలం చూస్తూ కూర్చోవాలని చెవిరెడ్డి ప్రశ్నించారు.

తాను నిక్కరేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ఆలోచనలో ఎలాంటి మార్పు లేదన్నారు. చంద్రబాబు పెద్దరికం మరిచి… ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం మంచి పద్దతి కాదన్నారు చెవిరెడ్డి.

First Published:  12 July 2019 12:52 AM GMT
Next Story