Telugu Global
NEWS

జీవో సంగతి ఇదీ లోకేష్‌...

ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్‌టీ 62ను లోకేష్‌ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఈ జీవోను ప్ర‌భుత్వ వెబ్‌సైట్ లో దానిని మొదట కాన్ఫిడెన్షియ‌ల్‌గా ప్ర‌స్తావించారు. త‌ర్వాత రెండ్రోజులకే నాట్ ఇష్యూడ్ అని మార్చేశారు. దీని ఆధారంగా నారా లోకేష్ జీవో 62పై రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ”పోర్టుల‌పై సొంత నిర్ణ‌యాలు తీసుకునే అధికారం ఎవ‌రికీ లేదు. జీవో ఆర్టీ 62 గుట్టు ఏంటో.. ముందు ర‌హ‌స్య జీవో అని చెప్పి, రెండు రోజుల్లో జారీ […]

జీవో సంగతి ఇదీ లోకేష్‌...
X

ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్‌టీ 62ను లోకేష్‌ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఈ జీవోను ప్ర‌భుత్వ వెబ్‌సైట్ లో దానిని మొదట కాన్ఫిడెన్షియ‌ల్‌గా ప్ర‌స్తావించారు. త‌ర్వాత రెండ్రోజులకే నాట్ ఇష్యూడ్ అని మార్చేశారు. దీని ఆధారంగా నారా లోకేష్ జీవో 62పై రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు.

”పోర్టుల‌పై సొంత నిర్ణ‌యాలు తీసుకునే అధికారం ఎవ‌రికీ లేదు. జీవో ఆర్టీ 62 గుట్టు ఏంటో.. ముందు ర‌హ‌స్య జీవో అని చెప్పి, రెండు రోజుల్లో జారీ చేయ‌లేదు అని ఎందుకు మార్చారు. బంద‌రు పోర్టు గురించి ప్ర‌జ‌ల్లో అపోహ‌లున్నాయి, ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఈ అంశంపై గందరగోళానికి అవకాశం లేకుండా స్పష్టత ఇచ్చాయి. జీవో ఆర్‌టీ 62 లోకేష్ ప్రచారం చేస్తున్నట్టు పోర్టును ఎవరికో అప్పగించే జీవో కాదు. అది ఆదినారాయణ అనే అధికారిని కాకినాడ పోర్టు ఆఫీసర్‌గా నియమిస్తూ ఇచ్చిన జీవో.

అయితే సదరు అధికారి నియామకంపై సీనియర్ ఆఫీసర్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాన్ని తొలుత కాన్ఫిడెన్షియల్‌గా ఉంచారు. అధికారిపై విచారణ తర్వాత అతడి నియామకాన్నే నిలిపేశారు. దాంతో ఆ జీవోను నాట్ ఇష్యూడ్‌గా ప్రకటించినట్టు అధికారులు వివరించారు.

అధికారుల వివరణతో లోకేష్ కు దిక్కుతోచడం లేదు. తెలుగుదేశం హయాంలో కొన్ని వందల రహస్య జీవోలు విడుదలయ్యాయి. ముఖ్యంగా లోకేష్ శాఖలకు సంబంధించి ఇలాంటి రహస్య జీవోలు ఎక్కువ వచ్చాయి. అవి బయటపడితే ప్రభుత్వ బండారం బయటపడుతుంది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం వాటిని రహస్య జీవోలు గా విడుదల చేసింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కూడా తాము విడుదలచేసిన జీవోల లాంటిదే అని భ్రమ పడి లోకేష్ అవేశపడి తన పరువు తానే తీసుకున్నాడు.

First Published:  11 July 2019 8:10 PM GMT
Next Story