Telugu Global
NEWS

లావణ్య లీలలు... ఎమ్మార్వో ఆఫీస్‌ ను ముట్టడించిన బాధితులు

రంగారెడ్డి కేశంపేట ఎమ్మార్వో లావణ్య పాపాల పుట్ట పగులుతోంది. కోట్లాది రూపాయలు కూడగట్టిన లావణ్య ఏసీబీకి పట్టుబడడంతో బాధితులు బయటకు వచ్చారు. కేశంపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు వందలాది మంది బాధితులు బైఠాయించారు. లంచం ఇవ్వనందుకు తమ భూముల రివార్డులను తారుమారు చేశారని బాధితులు నిరసనకు దిగారు. కలెక్టర్ ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. లంచం ఇస్తే ఒకరి భూములను మరొకరికి రాసిచ్చి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. మహిళా రైతు ఒకరు సర్వేయర్‌ […]

లావణ్య లీలలు... ఎమ్మార్వో ఆఫీస్‌ ను ముట్టడించిన బాధితులు
X

రంగారెడ్డి కేశంపేట ఎమ్మార్వో లావణ్య పాపాల పుట్ట పగులుతోంది. కోట్లాది రూపాయలు కూడగట్టిన లావణ్య ఏసీబీకి పట్టుబడడంతో బాధితులు బయటకు వచ్చారు.

కేశంపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు వందలాది మంది బాధితులు బైఠాయించారు. లంచం ఇవ్వనందుకు తమ భూముల రివార్డులను తారుమారు చేశారని బాధితులు నిరసనకు దిగారు.

కలెక్టర్ ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. లంచం ఇస్తే ఒకరి భూములను మరొకరికి రాసిచ్చి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు. మహిళా రైతు ఒకరు సర్వేయర్‌ కాళ్ల మీద పడ్డారు. తమను బతకనివ్వండి, నిజాయితీగా పనిచేయండి అంటూ కాళ్లు పట్టుకుని విజ్ఞప్తి చేశారు. వందల మంది బాధితులు ఎమ్మార్వో కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

లంచం ఇవ్వలేదని తన భూమిని మరొకరికి రాసేశారని ఎమ్మార్వో లావణ్యపై ఒక మహిళా రైతు ఆరోపించారు. తన భూమిని పాస్‌ పుస్తకంలోకి ఎక్కించేందుకు లావణ్య రెండు లక్షలు లంచం అడిగిందని మరో రైతు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి కేశంపేట ఎమ్మార్వో కార్యాలయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు బైఠాయించారు. మరో వ్యక్తి తన భూమి వివాదం విషయంలో కోటి రూపాయలు లంచం ఇవ్వాలని లావణ్య డిమాండ్ చేసిందన్నారు. ఎక్కువ మాట్లాడితే పోలీసులకు పట్టిస్తానంటూ తనను ఎమ్మార్వో లావణ్య బెదిరించిందని మీడియా ముందు వాపోయాడు.

పని చేసుకుంటే గానీ పూట గడవని తమను కూడా లంచం కోసం లావణ్య తీవ్రంగా వేధించిందని మరో మహిళా రైతు ఆవేదన చెందారు. పొలం కొన్న తర్వాత లంచం ఇవ్వలేదన్న కోపంతో లావణ్య తిరిగి భూమిని పాత యజమాని పేరుపైనే రికార్డుల్లోకి ఎక్కించారని మరో యువ రైతు వాపోయారు. కేశంపేట ఎమ్మార్వో కార్యాలయం మొత్తం లావణ్య మనుషులతో నిండిపోయిందని… లంచం ఇవ్వనిదే ఒక్క పని కూడా చేయకుండా వేధిస్తున్నారన్నారు.

First Published:  12 July 2019 7:00 AM GMT
Next Story