పోసానికి మరోసారి సర్జరీ… కారణం ఏంటంటే….

గత కొంతకాలంగా ప్రముఖ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం బాగుండడం లేదు. ఎన్నికల ముందు వరకు ఆయన వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.

పోసాని ఈ మధ్యనే హెర్నియా ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లు సమాచారం అందుతోంది.

ఆపరేషన్ జరిగిన చోట ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందని సమాచారం. దీనితో పోసాని కృష్ణ మురళి మళ్లీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే డాక్టర్లు మళ్ళీ ఆయనకు ఆపరేషన్ చేశారని… మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని…. తరువాతే పోసానిని డిశ్చార్జ్ చేస్తారని అంటున్నారు.

ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పోసాని కృష్ణ మురళి త్వరగా కోలుకుని…. మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.