కేజీఎఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ

వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ దాదాపు 4 నెలలుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మొన్నటివరకు అవి రూమర్లుగానే ఉండిపోయాయి. ఎట్టకేలకు ఈ పుకార్లు నిజమయ్యాయి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆ సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు స్వయంగా ప్రకటించారు.

మైత్రీ బ్యానర్ పై ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలి. ఈ మేరకు వాళ్ల దగ్గర్నుంచి ఎన్టీఆర్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ప్రశాంత్ నీల్ పేరును స్వయంగా ఎన్టీఆర్ సూచించాడట. వీలైతే అతడ్ని సంప్రదించండని తారక్ చెప్పడం, వెంటనే ప్రశాంత్ కూడా ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయట.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్నాడు. ఓవైపు ఈ సినిమా చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీత్ తో చర్చలు జరిపాడు ఎన్టీఆర్. వీళ్లిద్దరి మధ్య ఇప్పటివరకు 2సార్లు స్టోరీ సిట్టింగ్స్ జరిగాయట. కథ దాదాపు ఫిక్స్ అయిపోయింది. వచ్చే ఏడాది నుంచి సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఆర్-ఆర్-ఆర్ సినిమాను పూర్తిచేస్తే.. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్-2 పని పూర్తిచేస్తాడు.