వరుస ప్లాపులు…. మళ్ళీ కండీషన్స్…. పట్టాలెక్కుతుందా?

టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటిదాకా చూసిన క్రేజీ కాంబినేషన్ ల లో పూరి జగన్నాధ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ కూడా ఒకటి.

బాలయ్య హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ అనే సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే బాలకృష్ణ మరోసారి పూరితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ‘పైసా వసూల్’ సినిమా విడుదలకు ముందే బాలకృష్ణ పూరి తో మరొక సినిమా చేస్తానని చెప్పాడట.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలతో డిజాస్టర్లు చవిచూసిన బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం లో చేయాల్సిన సినిమాని కూడా పక్కకు తోసేసి ‘జై సింహ’ ఫేమ్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ఒక సినిమాని లైన్ లో పెట్టాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత బాలకృష్ణ… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బాలకృష్ణ ఈ సినిమాకి ఒప్పుకునే ముందు ఒక కండీషన్ పెట్టాడట…. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్టయితే అప్పుడే పూరి జగన్నాథ్ తో బాలకృష్ణ సినిమా చేస్తాడట.

కాబట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఫలితం పై పూరి జగన్నాథ్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ ఆధారపడి ఉండబోతుంది అన్నమాట.