Telugu Global
National

రాహుల్ తో పాటే కాంగ్రెస్ కాడి వదిలేస్తున్నారు....

కాంగ్రెస్ నావ మునగడానికి సిద్ధంగా ఉంది. కేవలం రెండు ఎంపీ సీట్లను సాధించి పార్లమెంట్ లో ఉనికి లేని బీజేపీ ఇప్పుడు వరుసగా రెండు సార్లు కేంద్రంలో క్లియర్ కట్ మెజార్టీతో గద్దెనెక్కింది. ఓడిన చోట గెలవాలి…. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు…. ఒక్కో రాయిని నిచ్చెనగా మలిచి అధికారంలోకి రావాలి…. అదే వీరుల లక్షణం. కానీ రాహుల్ గాంధీ మాత్రం అస్త్ర సన్యాసం చేశారు. ఇప్పుడు ఆయన వెంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దారిపట్టారు. అయితే […]

రాహుల్ తో పాటే కాంగ్రెస్ కాడి వదిలేస్తున్నారు....
X

కాంగ్రెస్ నావ మునగడానికి సిద్ధంగా ఉంది. కేవలం రెండు ఎంపీ సీట్లను సాధించి పార్లమెంట్ లో ఉనికి లేని బీజేపీ ఇప్పుడు వరుసగా రెండు సార్లు కేంద్రంలో క్లియర్ కట్ మెజార్టీతో గద్దెనెక్కింది. ఓడిన చోట గెలవాలి…. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు…. ఒక్కో రాయిని నిచ్చెనగా మలిచి అధికారంలోకి రావాలి…. అదే వీరుల లక్షణం.

కానీ రాహుల్ గాంధీ మాత్రం అస్త్ర సన్యాసం చేశారు. ఇప్పుడు ఆయన వెంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దారిపట్టారు. అయితే వారు వ్యూహాత్మకంగా రాహుల్ వల్లే రాజకీయాలకు దూరం కావడం లేదు. భవిష్యత్ ఉన్న బీజేపీలో చేరుతున్నారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పుట్టి ముంచుతోంది. ఆ పార్టీ ఉనికి కూడా లేకుండా చేస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. తాను విఫలమయ్యానని… పట్టు వీడేది లేదంటూ…. రాజీనామాను వెనక్కి తీసుకోవడం లేదు. దీంతో ఆయన బాటలోనే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పీసీసీ చీఫ్ లు, కాంగ్రెస్ బాధ్యులు కాంగ్రెస్ పదవులకు గుడ్ బై చెప్పారు.

మహారాష్ట్ర పీసీసీ చీఫ్ కూడా కాంగ్రెస్ కాడి వదిలేశారు. ఇక గోవాలో… కాంగ్రెస్ లో భవిష్యత్ లేదని 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయ్యి పార్టీ మారడం… కాంగ్రెస్ కు షాక్ లా మారింది. ఎందుకంటే 40 ఎమ్మెల్యే సీట్లున్న గోవా ఎన్నికల్లో
కాంగ్రెస్ 17 ఎమ్మెల్యే సీట్లు సాధించి లీడింగ్ పార్టీగా ఉంది. అయినా ఇక్కడ బీజేపీ స్వతంత్రులతో గద్దెనెక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనంతో బీజేపీ బలం అమాంతం పెరిగింది.

ఇక రాహుల్ రాజీనామా ఎఫెక్ట్ కర్ణాటకలోనూ కనిపిస్తోంది. అక్కడ 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.

ఇలా రాహుల్ అస్త్ర సన్యాసంతో… చుక్కాని లేని నావలా ఉన్న కాంగ్రెస్ ను ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వదిలేస్తున్నారు. నాయకుడిగా ఓటమిని జీర్ణించుకొని ముందుకెళ్లాల్సిన రాహుల్ ఇలా చేయడం.. ఆయన పార్టీలో లేకపోవడంతో, పార్టీ బలహీన పడడంతో, ఇక కాంగ్రెస్ లో తమకు రాజకీయ భవిష్యత్తు లేదని ఒక్కొక్కరూ తరలిపోతుండడంతో 100 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్ కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

First Published:  12 July 2019 2:29 AM GMT
Next Story